»   » దక్షిణాది సినిమా బెస్ట్‌: అక్ష‌య్ కుమార్‌

దక్షిణాది సినిమా బెస్ట్‌: అక్ష‌య్ కుమార్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సంవత్సరం బాలీవుడ్ పూర్తిగా డీలాపడిపోయింది. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా క్రేజీ అనిపించుకున్న సినిమా రానే లేదు. వచ్చిన సినిమాలు వరుస పెట్టి చతికిల పడుతున్నాయి. సల్మాన్ వంటి స్టార్ హీరో కూడా "ట్య్బ్బ్లైట్" అంటూ వచ్చి గట్టి దెబ్బే తిన్నాడు. తాజాగా విడుదలైన ఇందూ సర్కార్‌, ముబారకన్‌ సినిమాలకు కూడా డివైడ్ టాక్ వ‌చ్చింది. ఈ సంవత్సరానికి ఇప్పటివరకూ టాలీవుడ్ నుంచి వెళ్ళిన బాహుబలి 2 నే అతిపెద్ద హిట్ అని చెప్పుకోవాలి.

దీనిపై బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్‌ స్పందించాడు. 'మన సినిమాల్లో కంటెంట్‌ బాగా లేకపోవడమే ఇందుకు కారణం కావొచ్చు. ఏడాది బాలీవుడ్‌ సినిమాలు బద్రీనాథ్‌కి దుల్హానియా, హిందీ మీడియం వంటి సినిమాలు మినహా మిగ‌తా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా సక్సెస్‌ సాధించలేదు.

Akshay Kumar on poor success rate of Bollywood films

దక్షిణాదిలో ఎంతో సిస్టమేటిక్‌గా ఉంటారు. పబ్లిసిటీ కోసం వాళ్లు రూ. 2 కోట్లకు మించి ఖర్చు చేయరు. వాళ్లు రియాలిటీ షోలుగానీ, ఎక్కువ ప్రెస్‌మీట్లుగానీ చేయరు. వాళ్లు కూడా మనలాగే పండుగలకు సినిమాలు విడుదల చేస్తారు. వాళ్లు కూడా సినిమాల విడుదల తేదీని ముందే రిజర్వ్‌ చేస్తారు. మన సినిమాలను వాళ్లు కూడా ముప్పుగా భావించడం లేదు' అని అక్ష‌య్ చెప్పాడు.

మంచి సినిమానే బాక్సాఫీస్‌ వద్ద ఆడుతుంది అక్ష‌య్ అన్నాడు. తన తాజా సినిమా 'టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ' సినిమా కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిందని, రూ. 400 కోట్లతో తెరకెక్కిన 'బాహుబలి-2' తో తన సినిమాతో పోల్చడం సరికాదని, ఇది డిఫరెంట్‌ సినిమా అని ఆయన అన్నాడు.

English summary
Akshay Kumar who has been promoting his film Toilet Ek Prem Katha said in a recent interview that film is made on a budget of Rs 18 crore and he is expecting the film to get love from the audience. The actor also spoke about the poor success rate of Bollywood films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu