»   » స్టార్ హీరోయిన్లు నచ్చరట.. కొత్త హీరోయిన్లపైనే అక్షయ్‌కు మోజు

స్టార్ హీరోయిన్లు నచ్చరట.. కొత్త హీరోయిన్లపైనే అక్షయ్‌కు మోజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ హీరోనైనా తమ చిత్రాల్లో టాప్ హీరోయిన్లు ఉంటే బాగుండని కోరుకొంటారు. ఎందుకంటే మార్కెటింగ్ కైనా, లేదా ప్రేక్షకుడిని థియేటర్ రప్పించడానికైనా కీలక అంశంగా నిలుస్తాయి. కానీ బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తారు. ఎక్కువగా ఊరు పేరు లేని హీరోయిన్లకే ఈ ఖిలాడీ ఓటేస్తాడు. ఏ క్యాటగిరిలో ఉండే హీరోయిన్లు ఆయన సినిమాల్లో మచ్చుకైనా కనిపించరు. అక్షయ్ కుమార్ కెరీర్ ఆరంభం నుంచి చూస్తే తాజా హీరోయిన్లు, తెరమీద అంత గుర్తింపు లేని హీరోయిన్లకే ప్రాధాన్యమిస్తారనే విషయం స్పష్టమవుతుంది.

మొదటి నుంచి అదే తీరు..

మొదటి నుంచి అదే తీరు..

అక్షయ్ కుమార్ తొలి చిత్రం సౌగంధ్ పేరుతో 1991లో విడుదలైంది. ఆ చిత్రంలో దక్షిణాదికి చెందిన శాంతిప్రియ హీరోయిన్. ఆ సమయానికి దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లోనూ అంతగా గుర్తింపు లేని హీరోయిన్. ఇక ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్లు కీర్తీ సింగ్ (డ్యాన్సర్), కరిష్మా కపూర్ (దీదార్). అయితే అప్పటికి కరిష్మా కపూర్ ఇండస్ట్రీకి కొత్తే. అక్షయ్ కుమార్ నాలుగో సినిమా ఖిలాడీ. అప్పటికే ఫ్లాప్ చిత్రాల్లో నటించిన అయేషా జుల్కా ఆ చిత్రంలో కథానాయిక.

రవీనా, శిల్పాశెట్టితో మళ్లీ మళ్లీ..

రవీనా, శిల్పాశెట్టితో మళ్లీ మళ్లీ..

అక్షయ్ కుమార్ ఓ టాప్ రేంజ్‌కు చేరుకొన్నాక రవీనా టాండన్, శిల్పాశెట్టి, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హాతో నటించారు. వీరంతా కూడా అప్పుడప్పుడే పరిశ్రమలో అడుగుపెట్టిన వారే. వీరిందరితో అక్షయ్ రిపీట్ సినిమాలు చేశారు.

సోనాక్షి కూడా అప్పుడే..

సోనాక్షి కూడా అప్పుడే..

మొహ్రాలో రవీనా టాండన్, అందాజ్‌లో ప్రియాంక చోప్రా, లారా దత్తా నటించే సమయానికి వారు అప్పడప్పుడే బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. రౌడీ రాథోడ్‌లో అక్షయ్‌కి జతకట్టే సరికి సోనాక్షి కూడా పరిశ్రమకు కొత్తదే.

ప్రీతీ, అమీషా, భూమిక నూతన తారలే..

ప్రీతీ, అమీషా, భూమిక నూతన తారలే..

అక్షయ్ కుమార్ సరసన నటించిన ఆర్తీ, చాబ్రియా, ప్రీతి జింగ్యానీ, దివ్యా కోస్లా, ఆయేషా టకియా, అమీషా పటేల్, భూమికా చావ్లా, ఆసిన్, త్రిషా, కాజోల్ అగర్వాల్ లాంటి వాళ్లు ఏ గ్రేడ్ హీరోయిన్లు కాదు. అయినా అక్షయ్ వారినే ఎంచుకోవడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

సోనాక్షితో హాలీడే.. తమన్నాతో ఎంటర్‌టైన్‌మెంట్

సోనాక్షితో హాలీడే.. తమన్నాతో ఎంటర్‌టైన్‌మెంట్

2014లో అక్షయ్ కుమార్‌తో సోనాక్షి సిన్హా (హాలీడే), తమన్నా (ఎంటర్‌టైన్‌మెంట్), శ్రుతిహాసన్ (గబ్బర్ ఈస్ బ్యాక్) నటించారు. ఇక బ్రదర్స్‌, హౌస్‌ఫుల్‌లో జాక్వెలైన్ ఫెర్నాండేజ్, సింగ్ ఈస్ బ్లింగ్‌లో అమీ జాక్సన్‌లు అక్షయ్‌తో జోడి కట్టారు.

2017లోను అదే ఫార్మూలా

2017లోను అదే ఫార్మూలా

2016, 2017లో కూడా అక్షయ్ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. రుస్తుంలో ఇలియానా, ఎయిర్ లిఫ్ట్‌లో నిర్మత్ కౌర్, జాలీ ఎల్ఎల్బీ2లో హ్యూమా ఖురేషీ నటించింది. త్వరలో రానున్న దేసీ బాయ్స్‌లో చిత్రాంగత సింగ్, ప్యాడ్ మ్యాన్‌లో రాధికా ఆప్టే నటిస్తున్నారు.

English summary
Akshay Kumar prefers only fresh talent, not A-list heroine. Many heroines in his movies are new comers. Akshay had his share of new heroines or those who were never in the top list—Aarti Chhabria, Preeti Jhangiani, Divya Khosla (now Kumar), Ayesha Takia, Amisha Patel and even Bhumika Chawla, Asin, Trisha and Kajal Aggarwal from the South.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu