»   » స్టార్ హీరోలుజిమ్‌: ఫిట్‌నెస్‌ సీక్రెట్స్ చెప్తూ (వీడియోలు)

స్టార్ హీరోలుజిమ్‌: ఫిట్‌నెస్‌ సీక్రెట్స్ చెప్తూ (వీడియోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: హీరోలు సిక్స్ ప్యాక్ లు చేయటం, ఎయిట్ ప్యాక్ లు చేయటం కామన్ అయ్యిపోయింది. ఓ రకంగా ఇండియాలో ఈ ట్రెండ్ కు బాలీవుడ్ హీరోలు శ్రీకారం చుట్టారు. తాము ఎలా ఫిట్ ఉంటున్నారో తమ అబిమానులు సైతం తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా వారు వీడియో లు విడుదలుచేస్తున్నారు. ఈ వీడియోలు హీరోలకు ప్రమోషన్ తో పాటు తాము చేస్తున్న సినిమాల ప్రమోషన్ కు సైతం ఉపయోగపడుతున్నాయి. అలాంటి వీడియోలో తాజాగా అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హొత్రా విడుదల చేసిన వీడియోలు పాపులర్ అవుతున్నారు. మీరూ ఆ వీడియోలు ఇక్కడ చూడండి.

'బ్రదర్స్‌' చిత్రం కోసం అక్షయ్‌, సిద్ధార్థ్‌ ప్రత్యేకంగా తమ శరీరాకృతి కోసం పాటించిన నియమాలను, పద్ధతులను అభిమానులతో పంచుకున్నారు. వారు చిత్ర నిర్మాణంలో చేసిన వివిధ విన్యాసాలను చిత్ర నిర్మాణ సంస్థ తమ యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా విడుదల చేసింది.

ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో అక్షయ్‌ అభిమానులకు సూచిస్తున్నారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.

తాజాగా ప్రముఖ దర్శకులు కరణ్‌ మల్హొత్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన 'వారియర్‌' చిత్రాన్ని 'బ్రదర్స్‌'గా బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అన్నదమ్ములుగా అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హొత్రా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇద్దరు టాప్‌ బాక్సింగ్‌ యోధుల మధ్య జరిగే పోరాటానికి సంబంధించింన కథ. ఇక్కడ సిద్దార్ద్ మల్హోత్రా వీడియోను చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్క ఇందులో కరీనా కపూర్‌ ఖాన్‌ 'మేరా నామ్‌ మేరీ' అనే ఓ ఐటం సాంగ్‌లో కనిపించనుంది. ఇటీవల సాంగ్ టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఊరించిన నిర్మాతలు తాజాగా పూర్తి సాంగును రిలీజ్ చేసారు. సూపర్ హాట్ లుక్ తో కరీనా కపూర్ ఆకట్టుకుంటోంది. సాంగ్ సినిమాకు మరింత ప్లస్ అవడంతో యూత్ ను థియేటర్ల వైపు పరుగులు పెట్టించే విధంగా ఉంది. ఆ సాంగ్ పైనా ఓ లుక్కేయండి

ఇంతకు ముందు 'దబంగ్-2'లో ఫెవికాల్ సాంగ్ లో చిందేసి కనువిందు చేసిన కరీనా కపూర్ , ఈ సారి కూడా తనదైన పంథాలో పసందు చేయనుంది. అక్షయ్‌ కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా కలిసి నటించిన బ్రదర్స్‌ చిత్రంలో ఇద్దరూ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జాకీష్రాఫ్‌ కీలకమైన పాత్రలో నటించారు. ముగ్గురూ ఈ చిత్రంలో చిరుగడ్డంతో రఫ్‌గా కనిపించనున్నారు.

English summary
Akshay Kumar recommends spider pushups. Watch the video and With Akshay Kumar. For the first time, the fitness gurus come together to share their fitness secrets. Watch all the Stay Fit videos with Akshay Kumar and Sidharth
Please Wait while comments are loading...