»   »  ఎక్కడ పడితే అక్కడ తాకాడు: హీరో మీద లైంగిక వేదింపు జరిగిందట

ఎక్కడ పడితే అక్కడ తాకాడు: హీరో మీద లైంగిక వేదింపు జరిగిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

మ‌హిళ‌ల‌పైనే కాదు చిన్నపిల్ల‌ల‌పై కూడా లైంగిక వేధింపులు జ‌రుగుతాయ‌ని, వాటి గురించి వాళ్లు చెప్ప‌లేక పోయినా త‌ల్లిదండ్రులు అర్థం చేసుకోవాల‌ని చెప్తున్నాడు అక్షయ్ కుమార్. లైంగిక వేధింపులు మహిళలకే కాదు.. పురుషులకు కూడా ఉంటాయనే విషయం కొన్ని సంఘటనల ద్వారా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే, నేరం బయటకు వస్తే తప్ప పురుషులకు సంబంధించిన అలాంటి సంఘటలు వెలుగుచూడటం చాలా అరుదు. బయటకు చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడం కూడా ఇందుకు కారణం.....

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌

ఇలాంటి విషయాలను చెప్పడంలో తాను ఎప్పుడూ ముందుటానని బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ మరోసారి స్పష్టం చేశాడు. మహిళల్లాగానే తాను చిన్నవయసులో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని.,తన చిన్న వయసులో ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధించాడని, తను ధైర్యంగా ఆ విషయాన్ని ఇంట్లో చెప్పానని తెలిపాడు.

Akshay Kumar donates Rs 1.08 crore to Sukma CRPF martyrs' families | Oneindia News
లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు

మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి ముంబయిలో జరిగిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాలుడిగా ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్మొహమాటంగా బయటకు చెప్పేశాడు. నేను ఎదుర్కొన్న ఓ సంఘటన గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఎక్కడపడితే అక్కడ తాకాడు

ఎక్కడపడితే అక్కడ తాకాడు

నా చిన్నప్పుడు మేముంటున్న అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో వెళుతుంటే పక్కనే ఉన్న లిఫ్ట్‌బాయ్‌ నన్ను ఎక్కడపడితే అక్కడ తాకాడు. వెంటనే ఈ విషయాన్ని అమ్మానాన్నలకు చెప్పాను. దాంతో వాళ్లు అతన్ని హెచ్చరించి వదిలేశారు. ఆ తర్వాత కూడా అతను ఇలాంటి కేసులోనే చిక్కుకోవడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

త‌న కుమారుడితో కూడా

త‌న కుమారుడితో కూడా

రెండేళ్ల క్రితం త‌న కుమారుడితో కూడా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తిని ప‌నిలోంచి తీసేశామ‌ని అక్ష‌య్ చెప్పాడు. త‌మ‌కు జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి బాలీవుడ్ న‌టీమ‌ణులు సోన‌మ్ క‌పూర్‌, క‌ల్కి కొచ్లిన్‌లు బ‌హిరంగంగా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే! "ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పెద్దవాళ్లకు చెప్పాలి. అప్పుడే ఇలాంటి పనులకు పాల్పడేవారికి బుద్ధిచెప్పగలం." అంటూ చెప్పాడు అక్షయ్.

English summary
Actor Akshay Kumar has spoken about his own experience with sexual abuse, revealing that he was 'touched inappropriately' as a boy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu