»   » అపరిచితుడు స్పూఫ్ లా చేసారు: అయినా మొదటిరోజే 15 కోట్లు కొల్లగొట్టింది

అపరిచితుడు స్పూఫ్ లా చేసారు: అయినా మొదటిరోజే 15 కోట్లు కొల్లగొట్టింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హౌస్ ఫుల్ 3 నిజంగానే కామెడీ గా ఉంది ఈ దారుణమైన సిల్లీ కామెడీ సినిమా తొలి రోజున 15 కోట్లు వసూలు చేసింది. ఆ లెక్కన చూస్తే.. రానున్న రోజుల్లో బాగానే కూడబెట్టేసే ఛాన్సుంది. నిజంగా హిందీ ప్రేక్షకులు కామెడీకి ఎంత మొహం వాచిపోయి ఉన్నారో అర్థమౌతోంది. ఒక లెజెండ్ డైరెక్టర్ గొప్ప ప్రయోగాన్ని ఇంతగా అపహాస్యం చేసిన అక్కి.. నిజంగానే హౌస్ ఫుల్ల్ చేసుకుంటున్నాడు..

"అన్నియన్" (అపరిచితుడు) సినిమా ద్వారా ఇండియన్ స్క్రీన్ మీదనే ఇప్పటివరకూ రాని సబ్జెక్ట్ ని టచ్ చేస్తూ "స్ల్పిట్(మల్టిఫుల్) పర్సనాలిటీ డిజార్డర్" పై ఒక ప్రయోగం చేశాడు శంకర్. ఆ సినిమాలో ఒకే మనిషి ముగ్గురి విభిన్న దోరణిలో ఉండే మనూషుల మనస్తత్వాలతో.. అద్భుత మైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు విక్రమ్.నిజానికి అప్పటికి ఇండియన్ దర్శకుల్లో కనీసం ఎవరూ ఈ కాన్సెప్ట్ లో ఆలోచించనుకూడా లేదు. ఇదే కాన్సెప్టుతో రాజమౌళి 'ఛత్రపతి' సినిమాలో చిన్న కామెడీ స్పూఫ్ కామెడీ చేశాడు కూడా.

akshay

అయితే ఇప్పుడు అదే పాత్రని ఫుల్ లెంగ్త్ కామెడీ స్పూఫ్ చేసాడు హీరో అక్షయ్ కుమార్ "హౌస్ ఫుల్ 3" సినిమాలో చేశాడు. ఏదో ఒకటి రెండు సీన్లంటే ఓకె కాని.. అపరిచితుడు క్లైమ్యాక్స్ లో ఒకేసారి వెంటవెంటనే మూడు పర్సనాలిటీల నీ చూపించటం తరహా సీన్లను పదే పదే చేసి.. రచ్చ చేసి పాడేశాడు అక్కీ.

తెలుగు ప్రేక్షకులకు మాత్రం అవి చిరాకు పడక తప్పదు. పైగా శంకర్ క్రియేట్ చేసిన ఒక గొప్ప వర్కును మరీ దారుణంగా ఎగతాళి చేసినట్లు అనిపిస్తుంది కూడా.. మరి హిందీ ప్రేక్షకుల టేస్ట్ ఏమిటో గానీ హౌస్ ఫుల్ మాత్రం ఆ పేరుకు తగ్గట్టే కలెక్షన్లు రాబడుతోంది

English summary
Akshay Kumar's new movie house ful-3 is like a spoof on sauth Indian Director Shankar's annian (aparichitudu). but in north it is a big hit now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu