»   » సద్దాం హుస్సేన్ తో: అక్షయ్‌ 'ఎయిర్‌ లిఫ్ట్‌' టీజర్ (వీడియో)

సద్దాం హుస్సేన్ తో: అక్షయ్‌ 'ఎయిర్‌ లిఫ్ట్‌' టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కువైట్‌లో 1990లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం 'ఎయిర్‌ లిఫ్ట్‌'. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, నిమ్రత్‌ కౌర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిన్న ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన యూనిట్ ఈ రోజు టీజర్ ని తాజాగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ఈ టీజర్ లో మీకు సద్దాం హుస్సేన్ గా ఓ నటుడు కనిపిస్తాడు.

కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే క్రమంలో ఎదురైన పరిస్థితులను దర్శకుడు రాజ్‌ మీనన్‌ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్‌ అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

Akshay Kumar's Airlift ExclusiveTeaser

ఈ సందర్భంగా 'కువైట్ లో ఘటనలో ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమందికి తెలుసు.. ఒక యథార్థ గాథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఇలాంటి సినిమాలో భాగం కావడం' తనకు చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్ చేశారు.

Akshay Kumar's Airlift ExclusiveTeaser

కువైట్‌లో 1990లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రం 'ఎయిర్‌ లిఫ్ట్‌'. ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, లంచ్ బాక్స్ ఫేం హీరోయిన్ నిమ్రత్‌ కౌర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే క్రమంలో ఎదురైన పరిస్థితులను దర్శకుడు రాజ్‌ మీనన్‌ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్‌ అన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

English summary
Akshay Kumar unveiled the first teaser of Airlift film on Wednesday morning and it is both emphatic and edgy. Akshay plays Ranjit Katyal , an Indian businessman who controls a large conglomerate in Kuwait while Nimrat Kaur essays the role of his wife.
Please Wait while comments are loading...