»   » ఖరీదైన బోటులో ఫామిలీతో ఎంజాయ్ చేసిన సూపర్ స్టార్ (ఫోటోస్)

ఖరీదైన బోటులో ఫామిలీతో ఎంజాయ్ చేసిన సూపర్ స్టార్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నేడు 49వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెకేషన్ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.

ప్రత్యేకంగా ఓ యాచ్ (సముద్రంలో విహరించే ఖరీదైన పడవ లాంటిది) బుక్ చేసి షికారుకెళ్లారు. దీని రెంటు రోజుకు లక్షల్లో ఉంటుంది. అయినా సంవత్సరానికి వందల కోట్లు సంపాదించే లక్షయ్ కుమార్ లాంటి స్టార్లకు ఇలాంటి వాటిలో ప్రయాణించడం పెద్ద కష్టమేమీ కాదు.

ఈ బర్త్ డేకి అక్షయ్ కుమార్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టడమే ఇందుకు కారణం. రాబోయే కాలంలో ఇన్ని సినిమాలు చేయాలని టార్గెట్ పెట్టుకుని మరీ ముందుకు సాగుతున్నారు అక్షయ్.

భార్యతో కలిసి అక్షయ్ కుమార్.

భార్యతో కలిసి అక్షయ్ కుమార్.

భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి మాల్దీవుల్లో విహరిస్తున్న అక్షయ్. ఈ ఫోటోను ట్వింకిల్ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రిలీజ్ చేసారు. ఓ వైపు డెవిల్, మరో వైపు డీప్ బ్లూ సీ. ఈ హ్యాండ్సమ్ డెవిల్ తో చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ట్వింకిల్ ఖన్నా కామెంట్ చేయడం గమనార్హం.

తన కూతురు నిటారాతో కలిసి అక్షయ్

తన కూతురు నిటారాతో కలిసి అక్షయ్

సముద్రం మీద విహరిస్తూ కూతురు నిటారాతో కలిసి ఆడుకుంటున్న ఈ ఫోటోను అక్షయ్ కుమార్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఓ వైపు సన్ షైన్, పర్ ఫెక్ట్ బ్రీచ్, బీచ్ బంపింగ్ విత్ మై ప్రిన్సెస్... పర్ ఫెక్ట్ బర్త్ డే అంటే ఇదే. చాలా సంతోషంగా ఉంది అంటూ అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.

అసిన్ పుట్టినరోజు విషెస్ తెలిపింది

అసిన్ పుట్టినరోజు విషెస్ తెలిపింది

అక్షయ్ కుమార్ బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ శర్మను అసిన్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ సినిమాల్లో నటించడం ద్వారా అసిన్-రాహుల్ మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి ఇటీవలే ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. ‘క్రేజీ మన్మధుడికి హ్యాపీయెస్ట్ బర్త్ డే' అంటూ అసిన్ విషెస్ తెలిపింది.

అక్షయ్ కి విషెస్ తెలిపిన రితేష్

అక్షయ్ కి విషెస్ తెలిపిన రితేష్

రితేష్, అక్షయ్ కలిసి చాలా సినిమాల్లో కలిసి నటించారు. చివరగా ఇద్దరూ హౌస్ ఫుల్ 3లో నటించారు. హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ సాండీ అంటూ రితేష్ దేశ్ ముఖ్ ట్వీట్ చేసారు. హౌస్ ఫుల్ 3లో అక్షయ్ పాత్ర పేరు సాండీ.

దర్శకుడు సాజిద్ ఖాన్ విషెస్

దర్శకుడు సాజిద్ ఖాన్ విషెస్

అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్, హౌస్ ఫుల్ 2 సినిమాల ద్వారా సాజిద్ ఖాన్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్షయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా సాజిద్ ఖాన్ విషెస్ తెలియజేసారు. అంతకు ముందు తాను రెండు సినిమాలు చేసినా అపీషియల్ గా లాంచ్ అయింది అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ సినిమాతోనే, హౌస్ ఫుల్ 2లో కూడా నన్ను వాడుకున్నారు అంటూ సాజిద్ ఖాన్ ట్వీట్ చేసారు.

నటి నిమ్రట్ కౌర్ విషెస్

నటి నిమ్రట్ కౌర్ విషెస్

అక్షయ్ కుమార్ తో కలిసి ఎయిర్ లిఫ్ట్ సినిమాలో నటించిన నిమ్రట్ కౌర్ అక్షయ్ కుమార్ బర్త్ డే సందర్భంగా ట్వీట్ చేసారు. నవ్వించడంలో అక్షయ్ కుమార్ ను మించిన వారు లేరు. అలాగే సీరియస్ గానూ అదరగొడతారు. హ్యాపీ బర్త్ డే అంటూ నిమ్రట్ కౌర్ విష్ చేసారు.

బాలీవుడ్ నటుడు అభిషేక్ విష్

బాలీవుడ్ నటుడు అభిషేక్ విష్

ఈ సంవత్సరం అక్షయ్ కుమార్ కు మరింత మంచి జరుగాలి, మరింత సక్సెస్ సాధించాలి. హ్యాపీ బర్త్ డే సండీ అంటూ అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేసారు.

కరణ్ జోహార్ సాలిడ్ విష్

కరణ్ జోహార్ సాలిడ్ విష్

హ్యాపీ బర్త్ డే టు సాలిట్ మ్యాన్ విత్ ఎ సాలిడ్ హార్ట్. హ్యాపీ బర్త్ డే అక్షయ్ కుమార్ అంటూ కరణ్ జోహార్ విష్ చేసారు.

నటి హుమా ఖురేష్ విష్

నటి హుమా ఖురేష్ విష్

అక్షయ్ కుమార్ ప్రస్తుతం చేస్తున్న జాలీ ఎల్ఎల్ బి సినిమాలో నటిస్తున్న హుమా ఖురేషి అక్షయ్ కుమార్ కి బర్త్ డే విషెస్ తెలియజేసింది. జాలీ సినిమా పెద్ద హిట్ కావాలని ఇది మీరు మరో జాలీ ఇయర్ కావాలని అంటూ ఆమె ఆకాంక్షించారు.

అఫ్తాబ్ శివ్ దాసాని విష్

అఫ్తాబ్ శివ్ దాసాని విష్

విషింగ్ ఎ లాట్స్ ఆఫ్ లవ్, హ్యాపీనెస్ అండ్ మ్యాడ్ నెస్ అంటూ బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసాని ఫన్నీ ట్వీట్ చేసారు.

English summary
One of the most loved actors of B-town, Akshay Kumar turns an year older today and we got our hands on the first picture of the 'khiladi' celebrating his 49th birthday, along with her family in Maldives. See the picture of his birthday celebration with wife Twinkle Khanna and daughter Nitara below and also see, how other B-town celebs wished Akki on his birthday..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu