»   »  'సినిమా చూపిస్తా మామ' అంటున్న అక్షయ్ కుమార్ (వీడియో)

'సినిమా చూపిస్తా మామ' అంటున్న అక్షయ్ కుమార్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అక్షయ్‌ కుమార్‌, ఆమీ జాక్సన్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌'. బుధవారం అక్షయ్‌ కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఓ పాటని విడుదల చేశారు. ఈ పాట 'సినిమా చూపిస్తా మామ' అనే అర్దం వచ్చేలా..సినిమా దేఖే మామా సాగుతుంది. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అశ్విని యార్డి నిర్మాత. అక్టోబర్‌ 2న 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ పాటను మీరూ ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక తన తదుపరి చిత్రం 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌'పై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందోనని భయంగా ఉందని బాలీవుడ్‌ సినీ దర్శకుడు ప్రభుదేవా అన్నారు. అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, లారా దత్తా ప్రధాన పాత్రల్లో నటించిన 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌' చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వచ్చిన 'సింగ్‌ ఈజ్‌ కింగ్‌' చిత్రానికి దీనికి పోలిక ఏమీ లేదన్నారు.

 Akshay Kumar's Singh is Bliing: Cinema Dekhe MammaTrailer

సినిమా ట్రైలర్‌ వచ్చిన స్పందన చూస్తుంటే 200శాతం సంతోషంగా ఉందని, విడుదల తేదీ దగ్గరపడుతుంటే 500శాతం టెన్షన్‌గా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రమిది అని ఆయన చెప్పారు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌ పాత్రను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఓ టీజర్‌ను విడుదల చేసింది. అలాగే ఈ పాత్రకు సంభందించిన ఓ టీజర్ ని సైతం వదిలారు.

రఫ్‌తార్‌ సింగ్‌ అనే పాత్రలో అక్షయ్‌కుమార్‌ ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌తోపాటు అమీ జాక్సన్‌, లారా దత్త, కేకే మీనన్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 2న 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌' విడుదల కానుంది.

'బేబీ' లాంటి హిట్‌ చిత్రం తర్వాత బాలీవుడ్‌ హీరో అక్షరు కుమార్‌ నటిస్తున్న చిత్రం 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌'. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతోంది. 'రౌడీ రాథోడ్‌' వంటి యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది.

ప్రభుదేవా కూడా ఇందులో నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం పంజాబ్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ యాక్షన్‌ కామెడీ సినిమాలో ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. లారా దత్తా, వివేక్‌ ఒబేరారు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

'సింగ్‌ ఈజ్‌ కింగ్‌'కి ఈ చిత్రం సీక్వెల్‌ కాదు. ప్రేక్షకుల్ని ఆద్యంతం కడుపుబ్బ నవ్విస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడు ప్రభుదేవా మార్క్‌ చిత్రమిదంటున్నారు' అక్షరుకుమార్‌.'యాక్సన్‌ జాక్సన్‌' భారీ ఫెయిల్యూర్‌ తర్వాత ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెన్‌ ఇండియా ప్రైవైట్‌ లిమిటెడ్‌, గ్రేజింగ్‌ గోట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం అక్షయ్‌.. బ్రదర్స్‌, సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌, ఎయిర్‌లిఫ్ట్‌, హౌస్‌ఫుల్‌-3 సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్షయ్‌కుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్ర, జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రదర్స్‌' . 2011లో హాలీవుడ్‌లో విడుదలైన 'వారియర్స్‌' చిత్రానికి రీమేక్‌గా 'బ్రదర్స్‌'ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


English summary
Akshay Kumar's birthday, we get you a big treat, presenting Cinema Dekhe Mamma from Singh Is Bliing. Also starring Amy Jackson and Lara Dutta. Releasing on 2nd October.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu