Don't Miss!
- News
మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి..: ఏం చేశాయంటూ కాంగ్రెస్, బీజేపీలపై కేసీఆర్ ఫైర్
- Sports
డోపింగ్ టెస్టులో ఫెయిలైన భారత జిమ్నాస్ట్.. క్షమాపణలు చెప్పిన క్రీడాకారిణి!
- Lifestyle
Super Brain Yoga: సూపర్ బ్రెయిన్ యోగా, దీంతో ఎన్నో ఉపయోగాలున్నాయ్.. తెలుసా?
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Samrat Prithviraj : అక్కడ నిషేధం.. ఇక్కడేమో టాక్స్ ఫ్రీ.. ఇప్పుడు మరో రాష్ట్రంలో కూడా!
సౌత్ సినిమాల గ్రాండియర్ ను అందుకోవడానికి, సౌత్ సినిమాలను తలదన్నే విధంగా సినిమాలు చేయాలని బాలీవుడ్ మేకర్స్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే తానాజీ, తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లాంటి సినిమలు వచ్చి నిరాశ పరచగా ఇప్పుడు అదే కోవలో తెరకెక్కి రంగంలోకి దిగింది సామ్రాట్ పృథ్వీరాజ్. నటుడు అక్షయ్ కుమార్ కు శరవేగంగా సినిమాలు చేస్తాడని పేరుంది. అక్షయ్ తాజాగా నటించిన చిత్రం 'సామ్రాట్ పృథ్వీరాజ్', ఈ సినిమాలో మిస్ యూనివర్స్-2017 విజేత మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది.
సంజయ్ దత్, సోనూ సూద్ లు ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నగించింది. చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో జూన్ 3న హిందీ, తెలుగు, తమిళ్‌లో విడుదల అయింది.
అయితే ఈ సినిమాకు ఒక పక్క మన దేశంలో టాక్స్ ఫ్రీ అని కొన్ని రాష్ట్రాలు ఆఫర్లు ఇస్తుంటే, కొన్ని దేశాలు మాత్రం బ్యాన్ చేస్తున్నాయి. ఇప్పటికే 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాపై కువైట్, ఒమన్, ఖతర్ దేశాల్లో నిషేధం విధించారు. ఢిల్లీని రాజుగా పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.

మహమ్మద్ ఘోరీ దండయాత్ర నుంచి పృథ్వీరాజ్ భారతదేశాన్ని ఏ విధంగా రక్షించాడని ఈ మూవీలో ప్రధానంగా ఫోకస్ చేశారు. అయితే కొన్ని దేశాల్లో ఈ సినిమాను బ్యాన్ చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం సినిమాకు టాక్స్ ఫ్రీ అని ప్రకటిస్తున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్ మంగళవారం అక్షయ్ కుమార్ చిత్రం "సామ్రాట్ పృథ్వీరాజ్"పై టాక్స్ ఫ్రీ అని ప్రకటించింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇక ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు సినిమాకు పన్ను రహితంగా ప్రకటించిన నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా జూన్ 3న దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమాకు ముందే వివాదం ఎదురైంది. తొలుత ఈ సినిమాను 'పృథ్వీరాజ్' పేరుతొ విడుదల చేయాలనుకున్నారు, కానీ ఈ పేరు కారణంగా అక్షయ్ కుమార్ చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది.
ఇంతకు ముందు సినిమా పేరు పై కర్ణి సేన కూడా నిరసన వ్యక్తం చేసింది. తర్వాత సినిమా యూనిట్ ఈ సినిమాకి 'సామ్రాట్ పృథ్వీరాజ్' అని పేరు పెట్టారు. అయితే కలెక్షన్స్ విషయంలో కూడా సినిమా నష్టాలనే మిగిల్చే అవకాశం కనిపిస్తోంది. చిత్రంలో హిందుత్వ కోణాన్ని బయటకు తీసుకువచ్చి ప్రచారం చేయడంతో చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.