»   » నా భార్య మహా చిలిపి.. ఆమె కెమిస్ట్రీ బాగుంటుంది..

నా భార్య మహా చిలిపి.. ఆమె కెమిస్ట్రీ బాగుంటుంది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా దంపతులు ఇటీవల దర్శకుడు కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో వారిద్దరి కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ట్వింకిల్ ఖన్నా చిలిపితనం, ఆమె కెమిస్ట్రీ గురించి అక్షయ్ చెప్పిన విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.

జడ్జీగా నాచ్ బలియే 8 కార్యక్రమానికి నో..

జడ్జీగా నాచ్ బలియే 8 కార్యక్రమానికి నో..

ఈ షోలో అక్షయ్ మాట్లాడుతూ.. డ్యాన్స్ షో ‘నాచ్ బలియే 8' కార్యక్రమం కోసం జడ్జీలుగా వ్యవహరించాలని ట్వింకిల్‌ను, నన్ను సంప్రదించారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ప్రపోజల్‌ను ఒప్పుకోలేదని ఆయన తెలిపారు. అలా చేయడం వల్ల ఎదో కోల్పోయిన ఫీలింగ్ కలిగిందని ఆయన తెలిపారు.

పూర్తి నమ్మకం ఉన్న బాలీవుడ్ స్టార్

పూర్తి నమ్మకం ఉన్న బాలీవుడ్ స్టార్

జాలీ ఎల్ఎల్‌బీ 2 చిత్ర విజయంతో బాలీవుడ్‌లో నిర్మాతలకు పూర్తి నమ్మకం ఉన్న స్టార్ అనే ఘనతను అక్షయ్ కుమార్ దక్కించుకొన్నారు. ఖాన్ త్రయానికి దీటుగా అక్షయ్ ఇటీవల భారీ హిట్లను సాధించాడు. విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. ట్రేడ్ వర్గాల్లో కూడా అక్షయ్ అంటే మంచి నమ్మకం ఏర్పడింది.

వంద కోట్ల క్లబ్‌లో అక్షయ్ చిత్రాలు

వంద కోట్ల క్లబ్‌లో అక్షయ్ చిత్రాలు

ఇటీవల అక్షయ్ నటించిన చిత్రాలు వంద కోట్ల క్లబ్‌లో చేరాయి. ఎయిర్‌లిఫ్ట్, రుస్తుం, హౌస్‌ఫుల్ చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి. అక్షయ్ ఫిట్‌నెస్, ఆయన పాటించే ఆహార నియమాలు ఇతరులకు స్ఫూర్తిని కలిగించేలా ఉంటాయి.

4 గంటలకే నిద్ర లేవడం.. 6.30 గంటలకు డిన్నర్

4 గంటలకే నిద్ర లేవడం.. 6.30 గంటలకు డిన్నర్

ఉదయం 4 గంటలకే నిద్రలేవడం. ప్రతీరోజు వ్యాయామం, యోగా చేయడం అక్షయ్ దినసరి చర్య. బాలీవుడ్ నటుల మాదిరిగా పార్టీలు, పబ్‌లకు దూరంగా ఉంటాడు. సాయంత్రం 6.30 గంటలకే డిన్నర్ ముగిస్తాడు. షూటింగ్ స్పాట్‌కు నిర్ణీత సమయాని కంటే ముందే చేరుకోవడం అక్షయ్ ప్రత్యేకత.

English summary
Akshay Kumar and wife Twinkle Khanna made an appearance on Koffee With Karan together for the first time. Twinkle’s wit and her chemistry with Akshay became a talking point.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu