»   » వాడుకొని వదిలేశాడు.. చీటింగ్ చేశాడు.. అంతకంతా అనుభవిస్తాడు.. శిల్పాశెట్టి ఫైర్

వాడుకొని వదిలేశాడు.. చీటింగ్ చేశాడు.. అంతకంతా అనుభవిస్తాడు.. శిల్పాశెట్టి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ జీవితంలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. పూజా బాత్రాతో మొదలు రవీనా టాండన్, శిల్పశెట్టి తదితరులతో అఫైర్స్ అప్పట్లో బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఆ కోవలో అక్షయ్, శిల్పాశెట్టి అఫైర్ కూడా అప్పట్లో మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. తనను అక్షయ్ కుమార్ వాడుకొని వదిలేశాడు అని శిల్పశెట్టి ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. ఇటీవల ఓ వెబ్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ తీరును తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది.

  అక్షయ్‌తో అఫైర్ నాకు వ్యక్తిగతంగా చేదు అనుభవం

  అక్షయ్‌తో అఫైర్ నాకు వ్యక్తిగతంగా చేదు అనుభవం

  జీవితంలో అక్షయ్ కుమార్‌తో రిలేషన్ నాకు వ్యక్తిగతంగా పీడకల లాంటింది. అలాంటి దుర్భర జీవితం నుంచి బయట పడేసిన దేవుడికి రుణపడి ఉంటాను. ప్రతీ నల్లటి మేఘాల వెనుక ఓ కాంతిపుంజం ఉంటుంది. నా ప్రొఫెషనల్ జీవితంలో చోటుచేసుకొన్న ఘటనలు నా వ్యక్తిగత జీవితాన్ని బ్రష్టుపట్టించాయి. అలాంటి చేదు అనుభవాలను విజయవంతంగా అధిగమించడం గొప్ప ఊరట.

  విడిపోయినందుకు బాధలేదు

  విడిపోయినందుకు బాధలేదు

  అక్షయ్‌తో విడిపోయినందుకు అసలు బాధపడలేదు. నేను అమితంగా ప్రేమించిన వ్యక్తి నన్ను వాడుకోన్నాడనే విషయం ఎక్కువగా బాధించింది అని అక్షయ్‌ను ఉద్దేశించి శిల్పాశెట్టి వ్యాఖ్యలు చేసింది.

  బ్రేకప్ తర్వాత సహకరించాను

  బ్రేకప్ తర్వాత సహకరించాను

  అక్షయ్ తో బ్రేకప్ తర్వాత కూడా నిర్మాతలకు పూర్తిస్థాయిలో సహకరించాను. మేము నటించిన సినిమా పూర్తి కావాలి. త్వరగా విడుదల కావాలి. నా నిర్మాతలను వేధించకూడదు. నా వ్యక్తిగత జీవితం వల్ల మరొకరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే దడ్కన్ చిత్రాన్ని పూర్తి చేశాను. దడ్కన్ చిత్రంలో అక్షయ్, శిల్పశెట్టి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.

   పబ్లిక్ చేయొద్దని హెచ్చరించాడు

  పబ్లిక్ చేయొద్దని హెచ్చరించాడు

  తమ అఫైర్ గురించి పబ్లిక్‌కు చెప్పి తమాషా చేయవద్దని అక్షయ్ హెచ్చరించాడు. అదీ మా అఫైర్‌పై ఉన్న ఆయనకు ఉన్న అభిప్రాయం అలాంటిది. అంతా జరిగిన తర్వాత అక్షయ్ అంతకంటే ఏమి చెప్తాడు అని శిల్పాశెట్టి విమర్శించింది.

  అతడి గురించి అందరికి తెలియాలి

  అతడి గురించి అందరికి తెలియాలి

  అక్షయ్‌తో విడిపోయినందుకు ఎలాంటి బాధ లేదు. అక్షయ్ గురించి ప్రజలు తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం. అతని గురించి తెలిస్తే ఇతర హీరోయిన్లు కూడా జాగ్రత్త పడుతారు అని ఆమె అన్నారు.

  ట్వింకిల్ తప్పేమిలేదు.. అక్షయ్ అంతా చేశాడు..

  ట్వింకిల్ తప్పేమిలేదు.. అక్షయ్ అంతా చేశాడు..

  మేము విడిపోవడానికి కారణమైన ట్వింకిల్ ఖాన్నాపై ఎలాంటి కోపం లేదు. మా అఫైర్ బ్రేకప్ కావడానికి అక్షయ్ కారణం. నా సొంతం అనుకొన్న అక్షయ్ నన్ను చీట్ చేసినందుకు ఆమెను ఎందుకు తప్పుపట్టాలి. ట్వింకిల్ ను నిందించడం సమంజసం కాదు. ఈ వ్యవహారంలో తప్పంతా అక్షయ్‌దే అని శిల్ప ఆగ్రహంతో ఊగిపోయారు.

  పలు రకాలుగా ఉపయోగించుకొన్నాడు..

  పలు రకాలుగా ఉపయోగించుకొన్నాడు..

  అఫైర్‌లో ఉన్నప్పుడు నన్ను నానా రకాలుగా ఉపయోగించుకొన్నాడు. మరొకరు దొరికిన తర్వాత నన్ను నిర్ధాక్షిణంగా వదిలేశాడు. నా జీవితంలో ఎవరివల్లా ఎక్కువగా బాధపడ్డానంటే అది అక్షయ్ మాత్రమే. అయితే నేను అనుభవించిన బాధ త్వరలోనే అతనూ అనుభవిస్తాడు అని శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది.

  మరిచిపోవడం కష్టం

  మరిచిపోవడం కష్టం

  ఎన్నో చేదు అనుభవాలతో కూడిన గతాన్ని మరిచిపోవడం చాలా కష్టం. కానీ అలాంటి సంఘటనలు తట్టుకొనే శక్తి ఉండటం దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అక్షయ్‌తో రిలేషన్ ముగిసిన అధ్యాయం అని ఆమె చెప్పింది.

  మరోసారి అతడితో..

  మరోసారి అతడితో..

  జీవితంలో మరోసారి అతడితో కలిసి పనిచేయను. ప్రొఫెషనల్‌గా నా జీవితంలో ఎంతో కోల్పోయాను. ఇంకా అలాంటి పరిస్థితులు రావొద్దని కోరుకొంటున్నాను అని శిల్పాశెట్టి వెల్లడించింది.

  రాజ్ కుంద్రాతో వివాహం

  రాజ్ కుంద్రాతో వివాహం

  శిల్పాశెట్టితో బ్రేకప్ తర్వాత బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖాన్నాను అక్షయ్ కుమార్‌ వివాహమాడారు. ఆ తర్వాత ఎన్నారై వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను శిల్పాశెట్టి పెళ్లి చేసుకొన్నది.

  English summary
  Shilpa Shetty had accused Akshay Kumar of cheating on her and using her in an interview. She said that It has been a rough period personally. But I'm glad that the ordeal is over. After every dark cloud, there's always a silver lining. All this while though things were going well professionally, my personal life was pulling me down. It feels good that it's finally behind me.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more