»   » మీడియా సపోర్టు తో ‘అలా మొదలైంది’..నందినీ రెడ్డి

మీడియా సపోర్టు తో ‘అలా మొదలైంది’..నందినీ రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మీడియా సపోర్టు మాకు చక్కగా ఉండడంతో తమ చిత్రం అలా మొదలైంది ఇంతటి ఘన విజయవంతమయందని దర్శకురాలు నందినీరెడ్డి తెలిపారు.నాని,నిత్యామీనన్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై బి.వి.నందినీరెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్‌ప్రసాద్ నిర్మించిన 'అలా మొదలైంది" చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ వారి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు బి.వి.నందినీరెడ్డి ఇలా స్పందించారు. అలాగే...మేము అనుకున్నట్లుగానే ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుని విజయవంతంగా నడుస్తోంది. దాదాపు 54 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకోబోతోంది. ఈ నెల 15వ తేదీన శిల్పారామంలో 50 రోజుల వేడుకలను నిర్వహిస్తున్నాం. కచ్చితంగా సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ సందర్భంగా హాస్యనటులు, చిత్రంలోని నటీనటులు అనేక ఈవెంట్స్ చేయబోతున్నారు అన్నారు. అలాగే చిత్ర నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..చిత్రం విడుదలయ్యాక 50 రోజుల తర్వాత చిత్రానికి పనిచేసిన టీమ్ అంతా మళ్లీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మాకు సపోర్టు చేసిన అనేకమంది వ్యక్తులను సన్మానించదలచుకున్నాం. కేవలం మౌత్‌టాక్‌తోనే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను చేరింది. నందినీకి మొదటి చిత్రం. మా సంస్థకు మొదటి చిత్రం. ఇంత విజయం సాధించడం చాలా సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళ్యాణీమాలిక్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Ala Modalaindi has completed 50 days run in 54 centers. Ala Modalaindi 50 days function will be conducted at Shilpa Kala Vedika on 15th of March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu