»   » నేషనల్ అవార్డుకి నామినేట్ అయిన 'అలా మొదలైంది'..!

నేషనల్ అవార్డుకి నామినేట్ అయిన 'అలా మొదలైంది'..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

100 రోజులకు చేరువైన 'అలా మొదలైంది" సినిమా ఆ పండుగకి ముందే మరో విశేషమైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా నేషనల్ అవార్డుకి నామినేట్ అయ్యింది. ఇంత ఘనతకి కారణమైన నందిని రెడ్డి ఈ చిత్ర దర్శకురాలికి ఇది మొదటి సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని కేఎల్ దామోదర్ ప్రసాద్ శ్రీరంజిత్ మూవీ బానర్ పై నిర్మించిన విషయం తెలిసిందే. హీరో నాని సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎంతోకాలం కాలేదు.

హీరొయిన్ నిత్య మీనన్ కి సైతం ఇది తొలి సినిమా. కాకలు తీరిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎవరూ లేని ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించడమే కాకుండా నేషనల్ అవార్డుకి నామినేట్ అవ్వడం వారికీ, మనకీ గర్వించదగ్గ విషయం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ చిత్ర దర్శకురాలు కృష్ణవంశీ శిష్యురాలు. ఆయన డైరెక్ట్ చేసిన అంతఃపురం, ఖడ్గం, సింధూరం లాంటి ఎన్నో సినిమాలు ఇంతకు మునుపు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నవి.

English summary
Nani, Nithya Menon starrer Ala Modalaindi, which has hit the screens in the month of January, has proved to be a super hit at the Box-Office. The latest news is the film was nominated for the National Awards for the year 2010. The lead cast and crew of the film are happy for being nominated for the National Award and also with the Box-Office result of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu