అల.. వైకుంఠపురములో దూకుడు.. చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిన అల్లు అర్జున్

గత సినిమా 'నా పేరు సూర్య' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ చెరిపేసి వావ్! అనిపించారు అల్లు అర్జున్. వివరాల్లోకి పోతే..

దేశవిదేశాల్లో 'అల.. వైకుంఠపురములో'

దేశవిదేశాల్లో 'అల.. వైకుంఠపురములో'

విడుదలైన మొదటి రోజే బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న 'అల.. వైకుంఠపురములో' మూవీ నేటికీ దూకుడుగా వెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా దేశవిదేశాల్లో కలెక్షన్ల ప్రవాహం పారిస్తోంది. మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా ఎక్కడా కలెక్షన్స్ డ్రాప్ కాకపోవడం విశేషం.

మాంచి జోష్‌లో బన్నీ.. సంక్రాంతి విన్నర్‌

మాంచి జోష్‌లో బన్నీ.. సంక్రాంతి విన్నర్‌

టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ సత్తా చాటుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ అలరిస్తూ సంక్రాంతి విన్నర్‌గా నిలించింది. దీంతో ఈ విజయాన్ని చిత్రయూనిట్ అంతా ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు వైజాగ్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. మరోవైపు ఈ సక్సెస్‌తో బన్నీలో జోష్ పెరిగింది.

 సైరా రికార్డులకు చెక్ పెట్టిన బన్నీ

సైరా రికార్డులకు చెక్ పెట్టిన బన్నీ

మాటల మాంత్రికుడి సాయంతో వసూళ్ల విషయంలో కొత్త రికార్డులు తిరగరాస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు.. సైరా రికార్డులకు కూడా చెక్ పెట్టేస్తున్నాడు. ఇప్పటికే 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన 'అల.. వైకుంఠపురములో' మూవీ.. ఓవర్సీస్‌లో జోరుమీదుంది. సైరా కలెక్షన్స్ దాటేసి 3 మిలియన్ వైపు పరుగులు తీస్తోంది.

బన్నీ దూకుడు చూస్తుంటే..

బన్నీ దూకుడు చూస్తుంటే..

విడుదలైన వారం రోజుల్లోనే ఓవర్సీస్‌లో చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' లైఫ్‌టైమ్‌ షేర్ క్రాస్ చేసింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. సైరా 2.83 మిలియన్ వసూలు చేస్తే.. ఇప్పటికే 'అల వైకుంఠపురములో' దాన్ని క్రాస్ చేసేసింది. మొత్తానికి బన్నీ దూకుడు చూస్తుంటే ఫుల్‌రన్‌లో మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

Recommended Video

Allu Arjun Unbelievable Craze In Vizag
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌- అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌- అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత 'అల.. వైకుంఠపురములో' హ్యాట్రిక్ పూర్తి చేశారు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌- అల్లు అర్జున్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, టబు కీలక పాత్ర పోషించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X