For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిమానులకు అల్లు అర్జున్ రిక్వెస్ట్.. దయచేసి ఫాలో కావొద్దు అంటూ విన్నపం

  |

  ఈ రోజులో ఆ హీరో హీరోయిన్ అయినా ఫాలోయింగ్ పెంచుకునేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తనను ఫాలో కావొద్దంటూ విన్నవించుకుంటున్నారు. ఓ పబ్లిక్ ఈవెంట్‌లో అందరి ముందే బన్నీ ఈ మాట చెప్పారు. ఇంతకీ అల్లు అర్జున్ ఇలా ఎందుకు అనాల్సివచ్చింది. అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

  'అల.. వైకుంఠపురములో' రికార్డుల సునామీ

  'అల.. వైకుంఠపురములో' రికార్డుల సునామీ

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన 'అల.. వైకుంఠపురములో' మూవీ రికార్డుల సునామీ సృష్టిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తోంది. ఈ మేరకు గ్రాండ్ సెక్సెస్ మీట్ నిర్వహించి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించారు.

   గ్రాండ్ సెక్సెస్.. అల్లు అర్జున్ కామెంట్స్

  గ్రాండ్ సెక్సెస్.. అల్లు అర్జున్ కామెంట్స్

  ఈ వేడుకలో మాట్లాడిన అల్లు అర్జున్.. ముందుగా ‘అల వైకుంఠపురములో' సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు అంటూ స్పీచ్ ప్రారంభించారు. సినిమా గురించి, యూనిట్ సభ్యుల గురించి చెబుతూ అభిమానులను రిక్వెస్ట్ చేశారు.

  క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్.. యూత్ ఫిదా

  క్లైమాక్స్‌లో సర్‌ప్రైజ్.. యూత్ ఫిదా

  ‘అల వైకుంఠపురములో' సినిమాలో ''సిత్తరాల సిరపడు'' పాట ప్రతీ హృదయాన్ని హత్తుకుంది. మొదట సినిమా ప్రమోషన్స్‌లో బయటపెట్టని ఈ పాటను చిత్ర క్లైమాక్స్‌లో ప్రదర్శించి సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్. ఆ తర్వాత ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ పాటలో బన్నీ చాలా స్టైల్‌గా పొగ తాగుతూ ఫైట్ చేయడం యూత్‌ని బాగా ఆకట్టుకుంది.

  చూడగానే అల్లు అర్జున్ నిరాశ.. అందుకే

  చూడగానే అల్లు అర్జున్ నిరాశ.. అందుకే

  దీంతో బన్నీ స్టైల్ అచ్చం అలాగే ఫాలో అవుతూ.. నిజంగానే యూత్ అంతా సిగరెట్స్ తాగుతూ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు. టిక్ టాక్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల వేదికగా అవి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు అల్లు అర్జున్ కూడా చూసి కాస్త నిరాశ చెందారట. ఈ మేరకు తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో అలా చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశారు బన్నీ.

   ఆరోగ్యానికి హానికరం.. ఫాలో కావొద్దు

  ఆరోగ్యానికి హానికరం.. ఫాలో కావొద్దు

  పొగ తాగడం అనేది ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన అల్లు అర్జున్.. కేవలం సినిమాలో ఆ సన్నివేశం కోసం మాత్రమే తాను అలా పొగ తాగాల్సి వచ్చింది కానీ నిజ జీవితంలో సిగరెట్లకు చాలా దూరం అన్నారు. ప్లీజ్.. ఆ ఒక్క సీన్‌లో నన్ను ఫాలో కావొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా అన్నారు బన్నీ. మొత్తానికి ఆయన స్పీచ్ ఈ మీట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

  English summary
  Allu Arjun, Trivikram Srinivas hatric movie Ala vaikunthapurramuloo creating new records in Tollywood. Now in Thanks meet Allu Arjun requested all audians as.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X