For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ala Vaikunthapurramuloo Musical festival: రిలీజ్‌లో గ్యాప్.. ఆ విషయంలో గ్యాప్ ఉండదు.. అల్లు అర్జున్

  |

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అల వైకుంఠపురంలో'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం 2020, జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా జనవరి 6న యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో "అల వైకుంఠపురంలో..మ్యూజికల్ ఫెస్టివల్ ను " వైభవంగా, వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

  కథ సెట్ కావడానికి

  కథ సెట్ కావడానికి

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - ````ఎంట్రోయ గ్యాప్ ఇచ్చావ్‌.. ఇవ్వ‌లా వ‌చ్చింది`` ఇది డైలాగ్ కాదు, నా జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌నే. ఎందుకింత గ్యాప్ తీసుకున్నార‌ని అంద‌రూ అడిగారు. వారికి నేను చెప్పేది ఒక‌టి. నా మూడు చిత్రాలు సరైనోడు, డీజే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అయిన త‌ర్వాత చాలా స‌ర‌దా సినిమా చేయాలి. ఈజ్ ఉండాలి. ఎన్ని క‌థ‌లు విన్నా సుఖం రాలేదు. అలాంటి క‌థ సెట్ కావ‌డానికి త్రివిక్ర‌మ్‌గారు ఖాళీ అయ్యి.. సినిమా చేయడానికి ఇంత టైమ్ ప‌ట్టింది. అందుకే ఈ గ్యాప్. రిలీజ్‌లో గ్యాప్ ఉంటుందేమో కానీ.. సెల‌బ్రేష‌న్స్‌లో గ్యాప్ ఉండ‌దు అని అన్నారు.

  నా భార్యతో మ్యూజిక్ బ్యాండ్ ప్రోగ్రామ్స్‌కు

  నా భార్యతో మ్యూజిక్ బ్యాండ్ ప్రోగ్రామ్స్‌కు

  ఖాళీ ఉన్న రోజుల్లో మా ఆవిడ‌తో క‌లిసి మ్యూజిక్ బ్యాండ్ ప్రోగ్రామ్స్‌కు వెళ్లేవాడిని. ఇంటికొచ్చిన త‌ర్వాత ఈ మ్యూజిక్ బ్యాండ్స్ అంద‌రూ నా నెక్ట్స్ సినిమాలో ప్లే చేయాల‌ని అనుకునేవాడిని. ఆ విష‌యాన్ని మా ఆవిడ‌కు చెబితే.. అంత పాట ప‌డాలి క‌దా! అనేది. ఈ సినిమాషూటింగ్ స్టార్ట్ అయ్యింది. మ్యూజిక్ సిట్టింగ్స్ స‌మ‌యంలో ల‌వ్ సిట్యువేష‌న్ సాంగ్ వ‌చ్చిన‌ప్పుడు అంద‌రూ ఎలాంటి సాంగ్ ఉండాలనుకుంటున్నారని న‌న్ను అడిగారు. దానికి నేను అదేమో తెలియ‌దండి.. అంద‌రూ మ్యూజిక్ బ్యాండ్స్ వాళ్లు ఉండాలి అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

  సామజవరగమన సాంగ్ గురించి

  సామజవరగమన సాంగ్ గురించి

  అంద‌రికీ పిచ్చెక్కి పోయే సాంగ్ కావాలని నేను అన‌గానే త‌మ‌న్ సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సాంగ్‌ను వినిపించాడు. సిరివెన్నెల‌గారు, సిద్ శ్రీరామ్‌గారి వ‌ల్ల ఆ పాట స్థాయి ఎంతో పెరిగింది. సాంగ్ బాగా వ‌చ్చింద‌ని అనుకున్నాను కానీ.. ఈ పాట ఇంత సెన్సేష‌న్ అవుతుంద‌ని నేను క‌ల‌లో కూడా అనుకోలేదు. అంత గొప్ప పాట రాసిన సీతారామ‌శాస్త్రిగారు, పాడిన సిద్‌శ్రీరామ్‌కి, పాట కంపోజ్ చేసిన త‌మ‌న్‌కి, ఐడియా ఇచ్చిన త్రివిక్ర‌మ్ స‌హా పాట‌కు ప‌నిచేసిన టెక్నీషియ‌న్ అంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా థ్యాంక్స్‌. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ రాసిన ప్ర‌తి ఒక లిరిక్ రైట‌ర్ అందరికీ థ్యాంక్స్‌. త‌మ‌న్‌తో నాది హ్యాట్రిక్ ఆల్బ‌మ్‌. ఇర‌గ‌దీసే మ్యూజిక్ ఇచ్చాడు త‌మ‌న్‌. ఈ సినిమా సంగీతం వ‌ల్ల త‌న రేంజ్ మ‌రో రేంజ్‌కు వెళ్లింది అని అల్లు అర్జున్ తెలిపారు.

  సుశాంత్ హీరో అయినా

  సుశాంత్ హీరో అయినా

  పి.ఎస్‌.వినోద్‌గారికి థ్యాంక్స్‌. చాలా అందంగా చూపించారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాశ్‌గారికి, ఎడిట‌ర్ న‌వీన్‌గారికి, డాన్స్ మాస్ట‌ర్స్‌కి, రామ్ ల‌క్ష్మ‌ణ్‌గారికి మ‌న‌స్ఫూర్తిగా థ్యాంక్స్‌. న‌టీన‌టుల విస‌యానికి వ‌స్తే ముర‌ళీశ‌ర్మ‌గారు అద్భుత‌మైన పాత్ర‌ను పోషించారు. మంచి క్యారెక్ట‌ర్ ప్లే చేశారు. జ‌యరాంగారు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. అలాగే జేబీ అనే మ‌రో మ‌ల‌యాళ యాక్ట‌ర్ న‌టించారు. సునీల్‌, రాహుల్ రామ‌కృష్ణ‌కి థ్యాంక్స్‌. సుశాంత్‌కి స్పెష‌ల్‌గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే త‌నొక హీరో. త‌ను చేసిన ఈ పాత్ర‌లో త‌ను చేస్తే బావుంటుంద‌ని భావించి అడ‌గ్గానే క‌థ కూడా విన‌లేదు. న‌మ్మి చేశాడు. త‌న‌కు స్పెష‌ల్ థ్యాంక్స్‌ అని అల్లు అర్జున్ వెల్లడించారు.

  పూజా హెగ్డేతో రెండోసారి

  పూజా హెగ్డేతో రెండోసారి

  పూజా హెగ్డేతో రెండోసారి న‌టించాను. చాలా అందంగా న‌టించింది. నివేదా పేతురాజ్‌.. చ‌క్క‌గా న‌టించింది. ట‌బుగారి గురించి చెప్పాలంటే.. ఆవిడ పెర్ఫామెన్స్‌కు నేను పెద్ద అభిమానిని. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్‌. ఆమెతో క‌లిసి న‌టించ‌డం ఎంజాయ్ చేశాను. రావుర‌మేశ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, రోహిణి, ఈశ్వ‌రీగారు స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌. నిర్మాత‌లు రాధాకృష్ణ‌గారికి, వంశీకి థ్యాంక్స్‌ అని అల్లు అర్జున్ అన్నారు.

  English summary
  Ala Vaikunthapurramuloo Pre Release Event LIVE: watch Allu Arjun's Ala Vaikunthapurramuloo pre release event live here.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X