'అల.. వైకుంఠపురములో' సినిమాపై శర్వానంద్ కామెంట్స్.. బన్నీ ఫీలింగ్స్ చూస్తే!!

నేటితరం యంగ్ హీరోలు సినిమాల పరంగా ఎంతలా పోటీ పడుతున్నారో.. బయట అంతకుమించి ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ అందించుకుంటున్నారు. తోటి హీరో సినిమా విడుదలైతే చాలు ఆ సినిమా ఎలా ఉందో చెబుతూ సోషల్ మీడియా సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఇదే బాటలో యంగ్ హీరో శర్వానంద్.. అల్లు అర్జున్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో'పై స్పందించాడు. ఇది చూసి ఆ మరుక్షణమే బన్నీ రియాక్ట్ అయ్యారు. వివరాల్లోకి పోతే..

సంక్రాంతి పోరులో సత్తా చాటుతున్న బన్నీ..

సంక్రాంతి పోరులో సత్తా చాటుతున్న బన్నీ..

అల్లు అర్జున్ హీరోగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది 'అల.. వైకుంఠపురములో' సినిమా. రసవత్తర సంక్రాంతి పోరులో సత్తా చాటుతోంది. బన్నీ అభిమానులు ఖుషీ అయ్యేలా కలెక్షన్స్ రాబడుతూ సూపర్ ఫామ్‌లో ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై కొందరు సెలబ్రిటీలు స్పందించగా, తాజాగా యంగ్ హీరో శర్వానంద్ కామెంట్ చేశాడు.

హీరో శర్వానంద్ కామెంట్స్

హీరో శర్వానంద్ కామెంట్స్

''ఇప్పుడే 'అల.. వైకుంఠపురములో' సినిమా చూశా. చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవరీ ఫ్రేమ్‌లో బన్నీ ఇరగదీశాడు. ఈ సినిమా చూసి ఒక యాక్టర్‌గా నేను చాలా నేర్చుకున్నా. కాంగ్రాచులేషన్స్ త్రివిక్రమ్ గారు, తమన్, చినబాబు గారు అండ్ ఎంటైర్ టీం'' అంటూ శర్వానంద్ ట్వీట్ పెట్టాడు.

బన్నీ ఫీలింగ్స్ చూస్తే..

బన్నీ ఫీలింగ్స్ చూస్తే..

శర్వానంద్ పెట్టిన ట్వీట్ చూసి అల్లు అర్జున్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ''మై డియర్ శర్వా.. నీవు ఇచ్చిన ఈ కాంప్లిమెంట్స్‌కి కృతజ్ఞతలు. 'అల.. వైకుంఠపురములో' సినిమాను, నా వర్క్‌ని ఇష్టప్పడ్డందుకు చాలా ఆనందంగా ఉంది'' అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టారు బన్నీ.

కలెక్షన్ల సునామీ.. ఎక్కడా తగ్గేదే లేదు

సంక్రాతి విన్నర్‌గా నిలిచిన 'అల.. వైకుంఠపురములో' మూవీ కలెక్షన్స్‌లో డే బై డే గ్రోత్ కనిపిస్తోంది. మెల్లగా భారీ రేంజ్ బాక్సాఫీస్ దాడి ప్రారంభించారు అల్లు అర్జున్. ఎక్కడా తగ్గేదే లేదు అంటూ ఐదు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌వైడ్ టోటల్ షేర్ 71 నుంచి 74 కోట్లు నమోదు చేసిందని తెలుస్తోంది.

Recommended Video

భార్య స్నేహారెడ్డితో అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు..!! వీడియో వైరల్
'అల.. వైకుంఠపురములో' మూవీ

'అల.. వైకుంఠపురములో' మూవీ

గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందిన 'అల.. వైకుంఠపురములో' సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X