Just In
- 14 min ago
Naandhi Collections.. దుమ్ములేపిన అల్లరి నరేష్.. ఇప్పటి వరకు వచ్చిన లాభమెంతంటే?
- 35 min ago
తల్లి కాబోతోన్న ప్రభాస్ హీరోయిన్.. మొత్తానికి అలా గుడ్ న్యూస్ గుట్టు విప్పేసింది!
- 1 hr ago
నా ఫస్ట్ లవ్ నా హార్ట్ బ్రేక్.. అన్ని విషయాలు ఒకరికే తెలుసు.. గుట్టువిప్పిన సమంత
- 1 hr ago
Check 2nd day collections: నితిన్ మూవీ పరిస్థితి ఏమిటి? లాభాల్లోకి రావాలంటే..
Don't Miss!
- Sports
పిచ్‌ను నిదించడం సరికాదు: ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్
- News
Illegal affair: పెళ్లానికి పులిహోరా, ఉంచుకున్న దానికి...... ?, భార్య బంగారం, డబ్బు !
- Finance
అమెరికాకు భారీగా అప్పులు, చైనా, జపాన్ నుండే ఎక్కువ: భారత్‌కు ఎంత చెల్లించాలంటే
- Automobiles
అతి తక్కువ ధరకే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ పర్సన్ అల్లు అర్జున్.. పూజా హెగ్డే కామెంట్స్
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' మూవీ ఇటీవలే విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో ఆనందంలో మునిగితేలుతున్న చిత్రయూనిట్ ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు వైజాగ్ నగరాన్ని వేదిక చేసింది.
ఈ సందర్బంగా హీరోయిన్ పూజా హెగ్డే మాట్లాడుతూ "ఈ సినిమా సక్సెస్ గురించి ఇదివరకే ఇంటర్వ్యూల్లో మాట్లాడాను. అదే విషయాన్ని మళ్లీ తెలుగులో చెప్తాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఒక సినిమాకి సక్సెస్ రావాలంటే అది టీం ఎఫర్ట్ వల్లే సాధ్యమవుతుంది. అందుకే మా మొత్తం బృందానికి కంగ్రాట్స్. నాకు ఇంత పెద్ద హిట్టిచ్చినందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు స్పెషల్ థాంక్స్.

నన్ను ఇంత అందంగా చూపించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నా. 'బుట్టబొమ్మ' పాట మొత్తం నా మీదే రాసినందుకు థాంక్స్. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయిని అయిపోయాను. షారుఖ్ ఖాన్, సుస్మితా సేన్ లాంటి 'ఆరా'ను అల్లు అరవింద్ గారిలో చూస్తున్నాను. చినబాబు, నాగవంశీ లాంటి అందమైన హృదయమైన నిర్మాతల్ని నేను అదివరకు కలవలేదు.
బంటూ (అల్లు అర్జున్ ను ఉద్దేశించి) మీ గురించి మాట్లాడాలంటే కొంచెం ప్రాబ్లెం ఉంది. ఎందుకంటే ఆడియెన్స్ మీ గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. వాళ్లు మిమ్మల్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనీ, మల్లు అర్జున్ అనీ, టిక్ టాక్ స్టార్ అల్లు అర్జున్, గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ అల్లు అర్జున్ అని అంటుంటారు. మీతో హీరోయిన్‌గా రెండోసారి నటించాను. రాబోయే రోజుల్లో మళ్లీ మళ్లీ మీతో కలిసి నటించాలని ఆశిస్తున్నా. తమన్ తన మ్యూజిక్‌తో సినిమాని ఎలివేట్ చేశారు. ఈ సీజన్‌లో అవార్డ్స్ అన్నీ అతనికే వస్తాయి" అన్నారు.