Just In
- 4 min ago
మహేశ్‌కు మళ్లీ కథ చెప్పిన సక్సెస్ఫుల్ డైరెక్టర్: ఈ సారి మరో ప్రయోగం అంటూ రిప్లై
- 6 min ago
పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోంది.. నిహారికను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు!
- 37 min ago
RRR నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. డేట్ కూడా ఫిక్స్?
- 1 hr ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
Don't Miss!
- News
Same Sex marriage: మోడీ సర్కార్ నిర్ణయంపై భగ్గుమంటోన్న స్వలింగ సంపర్కులు: తొక్కేశారంటూ
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'అల వైకుంఠపురములో' సెన్సేషన్: రాములో రాములా.. ఆగం చేస్తోందిరో!
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించిన 'అల వైకుంఠపురములో' మూవీ నేటికీ రికార్డుల సునామీ సృష్టిస్తూనే ఉంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూలు చేసి బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించి తన అందచందాలతో మత్తెక్కించింది.
ఇక ఇవన్నీ ఒకెత్తయితే 'అల వైకుంఠపురములో' మూవీ పాటలు మరో ఎత్తు. విడుదలకు ముందు నుంచే హంగామా మొదలుపెట్టిన ఈ పాటలు నేటికీ ఫుల్ ఫామ్ లో ఉండటం విశేషం. థమన్ బాణీలు సంగీత ప్రియులను ఓ రేంజ్‌లో ఆకర్షించాయి. దీంతో ఈ పాటలు సృష్టించిన అలజడి ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరీ ముఖ్యంగా 'సామజవరగమన', 'రాములో రాములా' సాంగ్స్ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. 'అల వైకుంఠపురములో' సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. యూ ట్యూబ్ వరల్డ్ లో అయితే సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కాగా తాజాగా 'రాములో రాములా' సాంగ్ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. అతి తక్కువ కాలంలో యూ ట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా తన పేరును లిఖించుకుంది. ఈ మేరకు తమ ఆనందం వ్యక్తం చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.