మహేష్ బాబు అంటే తప్పు కాదు, నేను అంటే తప్పా...?

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవల ‘సైజ్ జీరో' ఆడియో వేడుకలో హీరోయిన్ అనుష్క తొడల గురించి అలీ కామెంట్ చేయడంతో మీడియాలో పెద్ద వివాదం అయిన సంగతి తెలిసిందే. సినిమా వేడుకల్లో అలీ హీరోయిన్ల గురించి వల్గర్ గా కామెంట్ చేస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. గతంలో సమంతపై కూడా అలీ కామెంట్ చేసారు.

అయితే తన కామెంట్స్ పై వచ్చిన విమర్శలపై అలీ తనదైన రీతిలో స్పందించినట్లు సమాచారం. తాజాగా ఆయన నటిస్తున్న షూటింగ్ లొకేషన్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. ‘మహేష్ బాబు కూడా ఖలేజా సినిమాలో అనుష్క తొడల మీద కామెంట్ చేసాడు. అప్పుడు ఎవరూ ఆ విషయాన్ని తప్పుబట్టలేదు. పాపులర్ యాక్టర్ కామెంట్ చేస్తే ఎవరికీ వివాదం అనిపించదు, నేను అంటే మాత్రం వివాదం అవుతుంది' అని అలీ అన్నట్లు ప్రచారం జరగుతోంది.

 Ali responds on his controversial comments

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖలేజా' సినిమాలో ‘దీని పిక్కలు చూసావా.. భయ్యాం' అంటూ అనుష్కను ఉద్దేశించి డైలాగ్ కొట్టడం తెలిసిందే.

సైజ్ జీరో ఆడియో వేడుకలో అనుష్క తొడలు గురించి కామెంట్ చేసాడు అలీ. ఈ ఆడియో వేడుకకు సుమ యాంకర్ గా వ్యవహరించింది. ఈ వేదికపై సొనాల్ చౌహాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు.. ఆమె నడుము గురించి సుమ ప్రస్తావించింది. ఆ వెంటనే.. అలీ.. సొనాల్ నడుము గురించి కాదు.. అనుష్క తొడ గురించి మాట్లాడితే బాగుంటుందనీ, 'బిల్లా' సినిమాలో అనుష్క తొడ చూసినప్పట్నుంచీ ఆమె తొడకు నేను అభిమానిని అయ్యాననీ అంటూ వ్యాఖ్యానించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X