»   » ఫోటో లీక్ : హైవేలో రొమాన్స్ అదరగొట్టారు

ఫోటో లీక్ : హైవేలో రొమాన్స్ అదరగొట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయిన బాలీవుడ్ దర్శకనిర్మాత మహేష్ భట్ కూతురు అలియా భట్ త్వరలో బాలీవుడ్ మూవీ 'హైవే' ద్వారా ప్రేక్షకులను అలరించబోతోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రణదీప్ హుడా హీరో.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఫోటో లీక్ అయింది. ఆ ఫోటోను బట్టి చిత్రంలో రణదీప్ హుడా, అలియా భట్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని స్పష్టం అవుతోంది. మహేష్ భట్ సినిమాల స్టైల్‌లో ఈ చిత్రంలోనూ మత్తెక్కించే ముద్దు సీన్లు, పడకగది సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.

ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న ఈచిత్రం ఒక రొమాంటిక్ డ్రామా. మహబీర్ భాటి పాత్రలో రణదీప్ హుడా, వీరా త్రిపాటి పాత్రలో అలియా భట్ నటిస్తోంది. తన తొలి మూవీలో శరణ్య పాత్రలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన అలియా భట్‌ పెర్ఫార్మెన్స్ పరంగా ఈ చిత్రంలోనూ అదరగొడుతుందనే అంచనాలతో ఉన్నారు ఆమె అభిమానులు.

రణబీప్ హుడా గతంలో నటించిన పలు చిత్రాల్లో పలు రొమాంటిక్ సీన్లలోనటించారు. ఈ నేపథ్యంలో అతని నుంచి ఈ చిత్రంలో కూడా అలాంటి సీన్లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...రణదీప్ హుడా, అలియా భట్ మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. ఈ నేపథ్యంలో తెరపై వీరిని చూసాక ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

English summary
While the audiences are eagerly waiting to see the next release of Alia Bhatt after her debut in Student Of The Year, we have a latest movie still from Highway.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu