»   »  ఫ్లయిట్‌లో వృద్ధుడిని ఉతికిపారేసిన ఆలియాభట్

ఫ్లయిట్‌లో వృద్ధుడిని ఉతికిపారేసిన ఆలియాభట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ తరం యువత పెద్దవాళ్లని గౌరవించరని వ్యాఖ్యలు చేసిన ఓ వృద్ధుడికి బాలీవుడ్ నటి అలియాభట్ గట్టిగా మందలించింది. పిల్లల మనోభావాలను గుర్తించడం చాతకాదని బుద్ది చెప్పింది. అలియాభట్‌కు, ఓ ప్రయాణికుడికి మధ్య విమానంలో జరిగిన సన్నివేశమిది.

 ఫ్లయిట్ లో అసలు జరిగిందేమిటంటే..

ఫ్లయిట్ లో అసలు జరిగిందేమిటంటే..


విమానంలో ప్రయాణించేందుకు అలియాభట్ టికెట్ బుక్ చేసుకొన్నది. తీరా ఫ్లయిట్ ఎక్కి తాను రిజర్వు చేసుకొన్న సీటు వద్దకు వెళ్లే సరికి ఓ వృద్ధుడి కూర్చుని ఉన్నాడు. తన సీటు వేరే చోట ఉందని, అలియాను చూసి తాను తన కుమారుడి పక్కనే కూర్చుంటానని తెలుపడంతో సరేనని అక్కడి వెళ్లింది.

 ఆ సీటు వద్దకు వెళ్లిన తర్వాత ఏమి జరిగింది

ఆ సీటు వద్దకు వెళ్లిన తర్వాత ఏమి జరిగింది

వృద్ధుడి సీటు వద్దకు వెళ్లి చూసే సరికి తాను కూర్చొనేందుకు వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లే సరికి ఆ సీటు ఇద్దరు పురుషుల మధ్య ఉండటంతో వెనుక్కి తిరిగివచ్చి అక్కడ కూర్చోలేనని మర్యాదగా వివరించింది. అలియాభట్ చెప్పిన మాటలకు చిరాకుపడిన ఆ వృద్ధుడు ‘చిన్న విషయాలకు కూడా అడ్జెస్ట్ కాలేరు ఈ తరం వాళ్లు' అని విసుక్కొంటాడు.

 యువతను తప్పుపట్టవద్దని అలియా మందలింపు

యువతను తప్పుపట్టవద్దని అలియా మందలింపు


వృద్ధుడి మాటలకు మండిపడిన అలియా ‘నా సౌలభ్యం కోసం ఈ సీటు బుక్ చేసుకొన్నాను. అయినా ఏదో పాపం అని సర్దుకుందామనుకొన్నాను. కానీ ఇద్దరు పురుషుల మధ్య కూర్చొని ఇబ్బందిపడలేను. అందుకే తిరిగివచ్చాను. అయితే సీటు బుక్ చేసుకొనే ముందు మీకు ఎలాంటి సీటు ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకోకపోవడం మీ తప్పు. యువతను తప్పుపట్టడం సరికాదు' అని ఘాటుగా అలియా సమాధానమిచ్చింది.

 డియర్ జిందగీ చిత్రంలోని డిలిట్ సీన్

డియర్ జిందగీ చిత్రంలోని డిలిట్ సీన్


ఈ సన్నివేశం నిజంగా జరిగింది కాదు. డియర్ జిందగీ చిత్రంలో తొలగించబడిన సన్నివేశాల్లో ఒకటిది. ప్రస్తుతం డిలేటెడ్ సీన్లను య్యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఈ సన్నివేశానికి ఇంటర్నెట్ లో విపరీతమైన స్పందన వస్తున్నది. డియర్ జిందగీ చిత్రంలో అలియా భట్ నటన విమర్శల ప్రశంసల అందుకొన్న సంగతి తెలిసిందే.

English summary
Alia can be seen giving a fitting reply to an old man complaining about how the current generation is spoilt.The scene takes place on a flight where Alia's seat is already taken by an old man who wants to sit with his son and asks her to take his seat instead. Alia is not too comfortable sitting there.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu