»   » అలియాభట్‌కు చేదు అనుభవం.. బాడీగార్డ్ తప్పతాగి కారులో.. అర్ధరాత్రి కాళరాత్రి..

అలియాభట్‌కు చేదు అనుభవం.. బాడీగార్డ్ తప్పతాగి కారులో.. అర్ధరాత్రి కాళరాత్రి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ తారలు బయటకు వెళ్లినపుడు అభిమానుల ఎగబడటం సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్స్ నుంచి రక్షణ కల్పించడం కోసం యాక్టర్లు బాడీగార్డులను ఉపయోగించుకొంటారు. అలా రక్షణగా ఉండాల్సిన బాడీగార్డ్ తప్పతాగి అలియాభట్‌కు తలనొప్పిగా మారడం చర్చనీయాంశమైంది. మలయాళ సినీ నటి కిడ్నాప్ ఉదంతం మరువక ముందే బాలీవుడ్‌లో తన అంగరక్షకుడి నుంచి బాలీవుడ్ అందాల తార అలియాభట్‌కు ఓ చేదు అనుభవం ఎదురుకావడంపై సినీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 సిద్ధార్థ్ ఇంటి వద్ద నుంచి

సిద్ధార్థ్ ఇంటి వద్ద నుంచి

వార్త కథనాల ప్రకారం.. తన లవర్ సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటి నుంచి రాత్రి 3 గంటల ప్రాంతంలో అలియా భట్ తన నివాసానికి బయలుదేరిందట. ఆ సమయంలో తన బాడీగార్డ్‌ కాల్ చేయగా స్పందించలేదట. పలు మార్లు కాల్ చేసిన తర్వాత బాడీగార్డ్ వచ్చాడట. కారులో తన పక్కనే బాడీగార్డ్ కూర్చొని ఉన్న సమయంలో అతను విపరీతంగా తాగి ఉన్నట్టు అలియాభట్ గుర్తించిందట. అతని వద్ద నుంచి మద్యం వాసన రావడంతో దూరంగా జరిగి కూర్చొన్న ఆలియా ఇంటికి వచ్చే వరకు ఊపిరి బిగపట్టి కూర్చొని ఉందట.

మద్య మత్తులో బాడీగార్డ్

మద్య మత్తులో బాడీగార్డ్

కారులో ప్రయాణిస్తుండగా తన పక్క సీట్లో కూర్చొని మత్తులో ఏదో ఏదో మాట్లాడటంతో అలియాకు ముచ్చెమటలు పట్టడం ఓ వంతైంది. దాంతో అప్పుడే బాడీగార్డును ఏమీ అనలేక గమ్మును కూర్చొని ఉందట. సిద్ధార్థ్‌ను కలిసి తిరిగి వచ్చేంతవరకు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొన్నదట. ఇంటికి రాగానే బాడీగార్డ్ తాగుడు వ్యవహారంపై తల్లి సోని రజ్దాన్‌కు వివరించిందట. దాంతో బాడీగార్డుకు ఆమె క్లాస్ పీకినట్టు తెలిసింది.

 కూతురు భద్రతపై తల్లి..

కూతురు భద్రతపై తల్లి..

తన కూతురు అలియా భట్ సేఫ్టీపై సోని రజ్దాన్ ఆరా తీసినట్టు తెలిసింది. తెల్లవారుజామున సదరు బాడీగార్డును తొలగించింది. తప్పతాగిన బాడీగార్డు వ్యవహారం అలియాను భయభ్రాంతులకు గురిచేసినట్టు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

 భంగపాటు.. సంతోషకరమైన వార్త

భంగపాటు.. సంతోషకరమైన వార్త

కాగా ఈసారి నేషనల్ ఫిలిం అవార్డుల్లో అలియాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన ఉడ్తా పంజాబ్ చిత్రానికి అవార్డు వస్తుందని ఆమె ఆశించింది. అయితే అవార్డు రాకపోవడం ఆమెను కొంత నిరాశకు గురిచేసింది. ఇదిలా ఉండగా, 50 మంది భారతీయుల ఫోర్బ్స్ సుసంపన్నుల జాబితాలో అలియాకు చోటుదక్కడం కొంత ఉపశమనం కలిగింది. ఇటీవల విడుదలైన బద్రినాథ్‌ కీ దుల్హనియా చిత్రం మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు వసూలు చేసింది.

English summary
Alia was reportedly paying a visit to her rumoured beau Sidharth Malhotra and at 3am, she called up her bodyguard to escort her home. Apparently, she finally got through to him after repeated calls and it was only in the car when he was seated next to her that Alia realised he was inebriated.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu