»   » నా ఫస్ట్ నైట్ వాళ్ళిద్దరికే అంకితం... ఆలియాభట్ మాటలకి షాకయ్యారు

నా ఫస్ట్ నైట్ వాళ్ళిద్దరికే అంకితం... ఆలియాభట్ మాటలకి షాకయ్యారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆలియా ప్రేమాయణం గురించి తరచూ వార్తలు రావడం చూస్తూనే ఉన్నాం. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి హాట్ హాట్ ఫోటోషూట్ లకి ఏ మాత్రం బిడియం లేకుండా ఫోజులు ఇచ్చిన సంగతి కూడా తెలుసిందే. తన ప్రేమను ఇటీవల అందరిముందు బహిర్గతం చేసింది. అసలు విషయం ఏంటంటే.. ఓ ప్రముఖ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రియుడి మీదున్న ప్రేమను ఒక మాటల్లో చెప్పేసింది. ''మీరు ఒక ద్వీపంలో గడపవలసి వస్తే ఎవరితో గడపడానికి ఇష్టపడతారు? అక్కడ సంసారం చేయాల్సివస్తే ఎవరితో చేస్తారు? అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు... ఆలియా తడుముకోకుండా సిద్ధూ పేరుని ఠక్కున చెప్పేసింది.

ఇచ్చిన ఆప్షన్స్‌లో రణ్‌వీర్‌ సింగ్‌, రణబీర్‌ కపూర్‌, షాహిద్‌, వరుణ్‌ ధావన్‌ వంటి యువ హీరోలు ఉన్నా..ఈ కుర్రది మాత్రం సిద్ధూతోనే సంతోషంగా గడుపుతా అని సమాధానం చెప్పింది. ఏదేమైనా సిద్ధూతో గాఢంగా ప్రేమలో ఉన్నట్టు అలియా పరోక్షంగా ఒప్పుకున్నట్లేనని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు చెప్పిన ఫస్ట్ నైట్ మాత్రం సిద్దు తో కాదు తన కుటుంబ సభ్య్లతో ఉండే రాత్రి గురించే చెప్పింది ఇంతకీ సంగతేమిటంటే....

Alia Bhatt talks about her New house for the first time

నాకెవరంటే ఇష్టం. ఎవరంటే కోపం. నేనెవరితో తిరుగుతాను. ఎవరితో డేటింగులో ఉన్నాను. ఈ విషయాలన్నీ ఎవరికీ పడితే వారికి చెప్తామా ఏంటి?' అంటోంది ఆలియా భట్. మరోపక్క ఈ భామ బాలీవుడ్ హీరో సిద్దార్ద్ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయంతెలిసిందే. తాజాగా ఈ భామ సిస్టర్ షహీన్‌తో కలసి తల్లిదండ్రులకు కాస్త దూరంగా కొత్త కాపురం పెట్టాలనుకుంటోంది. ఎంతో ఇష్టపడి కట్టించుకున్న కొత్త ఇంట్లోకి త్వరలోనే అక్కాచెల్లెళ్లు ఆలియా, షహీన్‌లు అడుగు పెట్టనున్నారు.

''ద ఫస్ట్ నైట్ ఇన్ ద న్యూ హౌస్ విల్ బి డెడికేటెడ్ టు మై పేరెంట్స్'' అని ఆలియా భట్ ఒక ట్వీటు ట్వీటింది. కొత్త ఇంట్లో తొలి రాత్రిని తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానంటూ చిలిపిగా చెప్పింది ఆలియా. గృహ ప్రవేశం రోజు రాత్రి అమ్మానాన్నలతో పాటు కుటుంబ సభ్యులందర్నీ పిలిచి గ్రాండ్ పార్టీ ఇస్తానని చెబుతోంది. ''నా జీవితంలో ఆ ఫస్ట్ నైట్ అంటే కొత్తగా కట్టుకున్న ఇంట్లో తొలిరాత్రి చాలా ముఖ్యమైన వేడుక. అతిథి మర్యాదలకు ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటాననే అనుకుంటున్నా'' అన్నారు ఆలియా. ఇరవై మూడేళ్లకు నటిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు సొంతంగా ఇల్లు కొనుక్కున్న ఆలియాను ముంబై జనాలు అభినందిస్తున్నారు.,

English summary
Alia Bhatt will be moving out of her parent's Juhu home in the next few weeks. She shared in an interview: The first night in the new house will be dedicated to my mum, dad and grandparents.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu