»   » అదృష్టంవతురాలు...యాక్సిడెంట్ లో ఏం కాలేదు

అదృష్టంవతురాలు...యాక్సిడెంట్ లో ఏం కాలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఆలియా భట్ కు యాక్సిడెంట్ అనే వార్త ఒక్కసారిగా ఆమె అభిమానుల్లో కలకలం రేపింది. అయితే అదృష్టవశాత్తు ఏమీ జరగలేదని మీడియాలో రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలీవుడ్ నటి ఆలియా భట్ కు పెద్ద ప్రమాదం తప్పింది. ఆమెతో పాటు నటుడు వరుణ్ ధావన్ కలిసి ప్రయాణిస్తున్న కారుని ఓ ఏసీపి కారు డీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

హంప్టీ శర్మా కీ దుల్హనియా చిత్రం ప్రమోషన్ లో భాగంగా అహ్మదాబాద్ వెళ్లిన ఆలియా భట్, వరుణ్ ధవన్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్తూండగా, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వీళ్ల కారుని ఏసీపి జే ఎస్ ఫర్మాన్ కారు ఢీ కొంది. ఈ సంఘటన ఈ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో జరిగింది.

వరుణ్ ధావన్, ఆలియాల కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు వెనక నుంచి వచ్చిన ఏసీపీ కారు ఢీ కొనటంతో వెనక అద్దం పూర్తిగా బ్రద్దలైపోయింది. గాజు ముక్కలు వెనక సీట్లో కూడా పడ్డాయి. వెంటనే ఆలియా, వరుణన్ ఇద్దరూ కారులోంచి బయిటకు దూకేసారు. వాళ్లను చూసి జనం గుమిగూడటూండటంతో వెంటనే వేరే కారులో అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే పోలీసులు మాత్రం ప్రమాద సమయానికి ఆలియా ఆ కారులో లేదని అంటున్నారు.

Alia Bhatt, Varun escape unhurt in car crash

ఇక 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల చిన్నది తొలి సినిమాలోనే బికినీలో కనిపించింది. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో లిప్‌లాక్‌ చేసింది. ఆ తర్వాత 'హైవే' సినిమాలో రణదీప్‌ హుడాతోనూ ముద్దు సన్నివేశాలకు వెనుకంజ వేయలేదు. ఇక '2స్టేట్స్‌'లో అర్జున్‌ కపూర్‌తో రెచ్చిపోయింది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా ముద్దులకు దిగి వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే చర్చలకు తెరతీసింది.

ఆమె రాబోయే సినిమా 'హంప్టీ శర్మాకి దుల్హనియా' కూడా అలియా, వరుణ్‌ధావన్‌ల మధ్య ఉన్న ముద్దుల సన్నివేశాల వల్ల సెన్సార్‌ ఇబ్బందుల్లో పడింది. ఆ దృశ్యాలకు క్లోజప్‌లు కత్తిరించాలని, లాంగ్‌షాట్లు ఓకేనని సెన్సార్‌ సుద్దులు చెప్పిందట. ఈ విషయాలను అలియా తండ్రి మహేష్‌భట్‌ దగ్గర ప్రస్తావిస్తే ఆయన కూడా ఇంతెత్తున లేచారు.

'మీడియా అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేస్తోంది. ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో 21 ఏళ్ల వయసున్న అమ్మాయి తెర మీద ముద్దుగా నటిస్తే ఇంత రాద్ధాంతమా? హాలీవుడ్‌లో ఇలాంటి వాటిని పట్టించుకోరు' అంటూ కోప్పడుతున్నారు.

అక్కడితో ఆగారా? 'ఏం సీరియల్‌ కిస్సర్‌ అనే గుర్తింపు మగవాళ్లకే ఉండాలా? ఆడవారికి ఎందుకు ఉండకూడదు? అలియా ఒక నటి. ఆమె దారి ఆమె ఎంచుకుంది. తన అభిప్రాయాల్ని నేను గౌరవిస్తాను' అని కూడా సెలవిచ్చారు. ఇక చెప్పేదేముంది?

English summary

 Actors Alia Bhatt and Varun Dhawan had a narrow escape when the car, in which they were travelling in Ahmedabad collided with another car on Monday morning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu