»   » వినాయకుడుని వేడుకుంటున్న అలీ (ఫోటో ఫీచర్)

వినాయకుడుని వేడుకుంటున్న అలీ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆలీ, సుజవారుని హీరో,హీరోయిన్స్ గా ఫణి ప్రకాష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆలీబాబా ఒక్కడే దొంగ'. కమల్‌ సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నూతన నిర్మాత బొడ్డేడ శివాజీ నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్‌ పూర్తయింది. రాకేష్‌ మాస్టర్‌ కొరియోగ్రఫిలో వినాయక చవితి నేపథ్యంలో ఓ పాటను సారథి స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఆలీబాబా నలభై దొంగలొచ్చింది ప్రేక్షకులకు వినోదాన్నిచ్చింది. ఆ తర్వాత అరడజను దొంగలొచ్చారు నవ్వుల జల్లు కురిపించారు. ఇప్పుడు ఒకడే దొంగ వస్తున్నాడు. వీడేం చేస్తాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అలీ.

దర్శకుడు మాట్లాడుతూ ''సినిమా టాకీపార్టు పూర్తయింది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే కథ ఇది. అలీ నటన ప్రధానాకర్షణ. ప్రస్తుతం రాకేశ్‌ మాస్టర్‌ నేతృత్వంలో 'గణేశా.. గణేశా.. లక్కిచ్చే గణేశా..' అనే పాటని తెరకెక్కిస్తున్నాము''అన్నారు. జాన్‌, సాయి శ్రీకాంత్‌, విహాల్‌, బొడ్డేడ శివాజి, రాకేశ్‌ మాస్టర్‌, జెల్లెశ్ల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మిగతా విశేషాలు...స్లైడ్ షోలో...

డా||ఆలీ మాట్లాడుతూ..

డా||ఆలీ మాట్లాడుతూ..

'గతంలో ఆలీబాబా టైటిల్‌తో వచ్చిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. కథకు, నా క్యారెక్టర్‌కు సరిపోతుంద ఈ టైటిల్‌ నిర్ణయించారు. కథ నచ్చి ఈ చిత్రం చేస్తున్నాను. దర్శకుడు చెప్పిన విధంగానే 25 రోజుల్లో టాకీ పూర్తి చేశారు. ఈ చిత్రంలో నాలుగు పాటలున్నాయి. మొదటిపాటను వినాయకుడి మీద చిత్రీకరిస్తున్నాం. మరో రెండు పాటలను బీదర్‌లో, చివరి పాటను ఆర్‌ఎఫ్‌సీలో తెరకెక్కిస్తాం. ఇందులో రెండు పాటలు పాడిన బాలుగారు సాహిత్యం వినిపిం చేలా సంగీముందని ప్రశంసించడం ఆనందంగా ఉంది. మంచి టీమ్‌ కుదిరింది. నిర్మాత సినిమా మీద పాషన్‌తో మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలనే తపనతో నిర్మిస్తున్నారు. ఇటువంటి నిర్మాతలు ప్రోత్సాహిస్తే మంచి సినిమాలొస్తాయి' అని అన్నారు.

అప్పుడు అర్దమైంది...

అప్పుడు అర్దమైంది...

‘‘అలీబాబా 40 దొంగలు.. పెద్ద హిట్‌. అలీబాబా అరడజను దొంగలు.. బంపర్‌హిట్‌. ఈ సినిమా కూడా విజయం సాధించడం ఖాయం. టైటిల్‌ చెప్పగానే జస్టిఫికేషన్‌ ఏమిటని దర్శకుడిని అడిగాను. వెంటనే కథ చెప్పాడు. టైటిల్‌ ఎంత కరెక్టో అప్పుడర్థమైంది. ఈ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సకాలంలో సినిమా పూర్తవుతోంది. సాయిశ్రీకాంత్‌ బాణీలు అద్భుతం. బాలు రెండు పాటలు పాడారు. బీదర్‌, ఆర్‌ఎఫ్‌సిలో షెడ్యూళ్లతో సినిమా పూర్తవుతుంది'' అలీ అన్నారు.

హీరోగా 50వ చిత్రం...నిర్మాత శివాజీ

హీరోగా 50వ చిత్రం...నిర్మాత శివాజీ

నాకు సినిమాలంటే ప్రాణం. మంచి సినిమాని ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనలో ఉన్నప్పుడు దర్శకుడు ఈ కథ చెప్పారు. నచ్చి ఈ కథకు ఆలీగారైతే సరిగ్గా సరిపోతారని ఆయన్ని ఎంపిక చేశాం. ఆయన హీరోగా నటిస్తున్న 50వ చిత్రం నా బ్యానర్‌లో రావడం గర్వంగా ఫీలవుతున్నాను. కొత్త నిర్మాతలను సపోర్ట్‌ చేస్తే మరిన్ని మంచి చిత్రాలను తీస్తాము'అని అన్నారు.

బిజీ అయినా...

బిజీ అయినా...

అలాగే మాట్లాడుతూ.. 'ప్రేక్షకులు మెచ్చే చిత్రం తీయాలని నిర్మాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అనుకోకుండా నేనొక రోజు ఆయన్ని కలిసి కథ చెప్పాను. వెంటనే ఓకే అన్నారు. తరువాత ఆలీగారిని కలిశాం. ఆయన బిజీ అయినప్పటికీ డేట్స్‌ ఇచ్చారు. అనుకున్న సమయంలో టాకీ పూర్తి చేశాం. కథలో ఇన్‌వాల్వ్‌ అయ్యి యాక్ట్‌ చేశారు. ఫన్నీగా సాగుతూ, చిన్న సెంటిమెంట్‌ ఉన్న చిత్రమిది. ఈ టైటిల్‌ క్రెడిట్‌ మాత్రం మా నిర్మాతకే చెందుతుంది. ఆయనే ఈ టైటిల్‌ను సూచించారు. సాయిశ్రీకాంత్‌ చక్కని బాణీలను అందించారు. సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది' అని నిర్మాత అన్నారు.

సంగీత దర్శకుడు సాయి శ్రీకాంత్‌ మాట్లాడుతూ..

సంగీత దర్శకుడు సాయి శ్రీకాంత్‌ మాట్లాడుతూ..

'సంగీత దర్శకుడిగా చక్కని అవకాశమిది. దర్శకుడి సహకారంతో మంచి సాహ్యితం, సంగీతం కుదిరాయి. నాకీ అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్‌' అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ..

దర్శకుడు మాట్లాడుతూ..

‘‘ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం అలీ. గంటలో ఎనిమిది షర్ట్స్ మార్చాడాయన. అంత ఓపిగ్గా ఈ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా నవ్విస్తుంది. అలాగే భావోద్వేగాన్ని కలిగిస్తుంది. తెలీని ఓ తీయని బాధను అందిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చే సినిమా అవుతుంది'' అని దర్శకుడు ఫణి ప్రకాష్ చెప్పారు.

కథేంటి...

కథేంటి...

''పోలీసు అవుదామనుకొని వచ్చి దొంగగా మారిన ఓ సరదా వ్యక్తి కథ ఇది. ఇందులోని ప్రతీ పాత్ర వినోదాన్ని పంచుతుంది. ఓ పక్క కామెడీగా ఉంటూనే, మరో పక్క చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందీ చిత్రం. ఇందులో ప్రతి పాత్రా ఆసక్తికరంగానూ, వినోదాత్మకంగానూ ఉంటుంది.

అలీ క్యారెక్టరేంటి...

అలీ క్యారెక్టరేంటి...

అలీ మాట్లాడుతూ... కత్తెరకీ, జేబుకీ తెలియకుండానే పర్సును కాజేస్తాడు అలీబాబా. అతను ఒక్కడే కానీ... వంద ఇళ్లకి కన్నాలేయగల నేర్పరి. అప్పుడెప్పుడో నలభైదొంగల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొన్నాం, విన్నాం. వారందరికంటే హుషారైనోడు ఈ దొంగ. అతని గురించి తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు అన్నారు.

రిలీజ్ ఎప్పుడు..

రిలీజ్ ఎప్పుడు..

చాలా గ్యాప్ తర్వాత అలీ హీరోగా నటిస్తున్న చిత్రం 'అలీబాబా ఒక్కడే దొంగ'. సుజావారుణి హీరోయిన్ . ఫణిప్రకాష్‌ దర్శకుడు. బొడ్డేడ శివాజీ నిర్మాత. ఈ చిత్రం పూర్తి ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. అలీ పుట్టినరోజుని పురస్కరించుకొని అక్టోబరు 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు:

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు:

తనికెళ్ళ భరణి, రఘుబాబు, షఫీ, గిరిబాబు, జీవా, రామరాజు, రాళ్ళపల్లి, డిల్లీ రాజేశ్వరి, పృధ్వీ, కొండవలస, కెమెరా: ఎస్‌డి. జాన్‌, సంగీతం: సాయి శ్రీకాంత్‌, సింగర్స్‌:ఎస్‌.పి.బాలు, నిహాల్‌, సునీత, లిప్సిక, రేవంత్‌, ఎడిటర్‌: నందమూరి హరి, ఆర్ట్‌: ఎ.భాస్కర్‌. కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం :ఫణి ప్రకాష్

English summary

 Comedian Ali in lead 'Ali Baba Okkade Donga' directed by Phani Prakash has already completed its Talike part. Suja Varuni is starring opposite Ali in the film. The film's next schedule will start from August 1st in Hyderabad. Raghu Babu, Jeeva, Kondavalasa, Delhi Rajeswari, Tanikella Bharani, Shafi are starring in the film. Sai Srikanth is the music director.
Please Wait while comments are loading...