For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అసలు పేరు వేరు, పవన్‌కి చిన్న సాయమే, చీప్‌గా రాశారు, బాధ పడ్డా : సప్తగిరి

  By Bojja Kumar
  |

  అతి తక్కువ కాలంలోనే కమెడియన్‌గా పాపులర్ అయి హీరోగా ఎదిగాడు సప్తగిరి. ప్రస్తుతం ఆయన నటించిన 'సప్తగిరి ఎల్ఎల్‌బి' బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెలుతోంది. ఈ సందర్భంగా ఆయన అలీతో జాలీగా అనే టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత, సినీ జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

  సప్తగిరి నేపథ్యం ఇదీ...

  సప్తగిరి నేపథ్యం ఇదీ...

  నేను పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లా ఐరాల మండలం. నాన్న ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో గార్డు. నా చదువంతా చిత్తూరు జిల్లాలోని బంగారు పాళ్యం, పుంగనూరు, పలమనేరు ప్రాంతంలో జరిగిందని సప్తిగిరి తెలిపారు.

  అలా సినిమాల వైపు

  అలా సినిమాల వైపు

  ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాశాను. ర్యాంకు రాక పోవడంతో చదువు మీద ఆసక్తి పోయింది. నాకు క్రికెట్, సినిమాలు అంటే చాలా ఇష్టం. మా ఊర్లో క్రికెట్ ఆడే పరిస్థితి లేదు. అందుకే సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చాను అని సప్తగిరి తెలిపారు.

  నా అసలు పేరు సప్తగిరి కాదు

  నా అసలు పేరు సప్తగిరి కాదు

  సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలనే ఆలోచన ఉన్న రోజుల్లో ఒక రోజు తిరుమలకు దర్శనానికి వెళ్లా. అలా తిరుమల మాడ వీధుల్లో సరదాగా తిరుగుతూ ఆలయాన్ని చూస్తూ ఒకచోట అలా నిలబడి ఉన్నా. సడెన్‌గా ఓ వ్యక్తి నా వెనుక నుంచి వచ్చి ‘నాన్నా సప్తగిరీ.. పక్కకు జరుగు' అన్నాడు. సాధారణంగా తిరుమలలో ఏ వ్యక్తి పేరైనా తెలియకపోతే వారిని గోవిందు.. నారాయణ.. ఇలా స్వామివారి పేర్లతో పిలుస్తారు. కానీ నన్ను ఎవరబ్బా సప్తగిరి అని పిలిచారని వెనక్కి తిరిగి చూశా. ఆయన్ని చూడగానే చిన్నజీయర్ స్వామిలా ఉన్నారు. పక్కకు జరిగి పూర్తిగా వెనక్కి తిరిగి చూడగా, అలాంటి వేషధారణలోనే ఓ 40మంది సాధువులు కనిపించారు. అంతా నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్లారు. అప్పుడు నాలో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. అప్పుడే నా పేరు సప్తగిరి అని పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను అని తెలిపారు.

  ఇండస్ట్రీకి నటుడు అవుదామని రాలేదు

  ఇండస్ట్రీకి నటుడు అవుదామని రాలేదు

  నాకు సినిమాలు అంటే ఇష్టం. అదే విధంగా కథలు చెప్పటం ఇష్టం. 10వ తరగతిలోనే సినిమాలు చూసి వాటిని ఎనాలసిస్ చేసేవాడిని. దర్శకుడిని అవుదామని హైదరాబాద్ వచ్చాను. బొమ్మరిల్లు భాస్కర్‌, శేఖర్‌ సూరి, చంద్ర సిద్ధార్థ్‌ ఇలా ఇద్దరు ముగ్గురు దర్శకుల వద్ద అప్రెంటిస్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, అసోసియేట్‌ దర్శకుడిగా పనిచేశా. అనుకోకుండా నటుడినయ్యాను అని సప్తగిరి తెలిపారు.

  బొమ్మరిల్లు భాస్కర్ వల్లే నటుడిని అయ్యాను

  బొమ్మరిల్లు భాస్కర్ వల్లే నటుడిని అయ్యాను

  ‘బొమ్మరిల్లు' భాస్కర్‌ నాకు నటుడిగా తొలి అవకాశం ఇచ్చారు. నా రూపం, చిత్తూరు యాసలో మాట తీరు, బాడీ లాంగ్వేజ్‌ భిన్నంగా ఉండేది. ముక్కుసూటిగా మాట్లాడేవాడిని. ఇవన్నీ బహుశా భాస్కర్‌ గారికి నచ్చి ఉంటాయి. ఓ అవకాశం ఇచ్చి చూద్దామని ‘బొమ్మరిల్లు' లో చిన్న పాత్ర ఇచ్చారు... అని సప్తగిరి తెలిపారు.

  నటుడిగా చేయను అని చెప్పినా

  నటుడిగా చేయను అని చెప్పినా

  ‘బొమ్మరిల్లు' సినిమాతోనే నటుడిగా తొలి షీల్డ్‌ అందుకున్నా. భాస్కర్ మళ్లీ నన్ను పిలి తన తర్వాతి సినిమాలో పూర్తిస్థాయి పాత్రను రాస్తున్నా అన్నారు. సర్‌ నాకు నటుడిని అవ్వాలన్న కోరిక లేదని, అసిస్టెంట్‌ ఛాన్స్‌ ఇవ్వాలని అడిగా. అంత పెద్ద పాత్ర నేను చేయలేను. ఏదైనా చిన్న క్యారెక్టర్‌ ఇవ్వమని అడిగా. నువ్వు నాకు చెప్పే వాడిరి అయ్యావు.... నిన్ను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పెట్టుకోవడం లేదు. ఆర్టిస్ట్‌గా చేస్తే చెయ్‌ లేకపోతే లేదు వెళ్లిపో' అన్నారు. చివరకు నేను ఒకటే చెప్పా.. నటుడిగా నేను మీకు ఇష్టం.. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నాకు నేను ఇష్టం రెండు అవకాశాలూ ఇవ్వండి అని అడిగితే ఓకే అన్నారు. అలా ‘పరుగు'లో ఆర్టిస్ట్‌గా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశా. తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయని... అని సప్తగిరి తెలిపారు.

  పవన్ కళ్యాణ్ అడిగితే టైటిల్ ఇచ్చేశా

  పవన్ కళ్యాణ్ అడిగితే టైటిల్ ఇచ్చేశా

  నా తొలి సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' టైటిల్ ముందుగా ‘కాటమరాయుడు' అనుకున్నాం. ‘పవర్‌స్టార్‌' పవన్‌ కళ్యాణ్ అడగటంతో ఇచ్చేశాం. పవన్ కళ్యాణ్ గారికి ఆ టైటిల్ ఇచ్చేయడంతో నా పేరుతోనే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్' అని సినిమాకు పేరు పెట్టాం. అది హిట్టవ్వడంతో హిందీ రీమేక్ జాలీ ఎల్ఎల్‌‌బి చిత్రానికి ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ' అని పెట్టాం. ఈ సినిమా కూడా హిట్ కావడంతో ‘సప్తగిరి విత్‌ సన్నీలియోని', ‘సప్తగిరికి దెయ్యంపట్టింది' ‘సప్తగిరి రివాల్వర్‌' ‘సప్తగిరి ఎంబీబీఎస్‌' లాంటి టైటిల్స్‌తో వస్తున్నారు. తర్వాతి సినిమాలకు సప్తగిరి పేరు కొనసాగించక పోవచ్చు అని తెలిపారు.

  ముందు పవన్ కళ్యాణ్ గారికి టైటిల్ ఇవ్వనన్నాం... కానీ మళ్లీ వచ్చారు

  ముందు పవన్ కళ్యాణ్ గారికి టైటిల్ ఇవ్వనన్నాం... కానీ మళ్లీ వచ్చారు

  పవన్‌ సినిమా నిర్మాత వచ్చి ‘కాటమరాయుడు' పవన్‌కు బాగా నచ్చింది.. టైటిల్‌ ఇవ్వగలవా? అని అడిగారు. ఆయన అలా అడగటంతో షాక్‌ అయ్యాం. మా సినిమాకు పెట్టేశాంగా ఇవ్వమని చెప్పాం. మళ్లీ 15రోజుల తర్వాత వచ్చారు. పవన్‌ కళ్యాణ్‌గారు అడగటంతో నిర్మాతను ఒప్పించి.. టైటిల్‌ ఇచ్చాం. అంత పెద్ద సినిమాకు, పెద్ద మనసున్న వ్యక్తికి మనం చిన్న హెల్ప్‌ చేసినట్లు అవుతుందని చెప్పడంతో నిర్మాత ఒప్పుకున్నాడని సప్తగిరి తెలిపారు.

  చాలా చీప్‌గా రాశారు

  చాలా చీప్‌గా రాశారు

  అలీ మాట్లాడుతూ...."సప్తగిరి ఆడియో ఫంక్షన్లో ‘హీరో అయిన తర్వాత నేను కమెడియన్‌ పాత్రలు చేయను' అని ఒకరిద్దరు చేతులు కాల్చుకున్నారు.. రెండూ చేయాలి" అని నేను చెబితే సప్తగిరికి, సునీల్‌కి అలీ వార్నింగ్‌ ఇచ్చాడని వెబ్ సైట్లలో రాశారని తెలిపారు. దీనిపై సప్తగిరి స్పందిస్తూ... ఈ మధ్య రాసేవి చాలా చీప్‌గా ఉంటున్నయి. అవి పట్టించుకుంటే ముందుకు వెళ్లలేం. నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో అలీ ఒకరు. ఆయన మంచి కోరుకునే విధానంలో 100శాతం పాజిటివ్‌నెస్‌ ఉంటుంది అన్నారు.

  అపుడు చాలా బాధ పడ్డా

  అపుడు చాలా బాధ పడ్డా

  సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ ఆడియో ఫంక్షన్‌లో మీరు(అలీ) చెప్పినది రాంగ్‌వేలో మారిపోయి చర్చ జరిగినప్పుడు చాలా బాధపడ్డా. అదే విధంగా గ్యాస్‌ ప్రాబ్లమ్‌తో మా సినిమా నిర్మాత డాక్టర్‌ రవికిరణ్‌ దగ్గరకు వెళ్తే.. ‘సప్తగిరికి అనారోగ్యం' అని రాశారు. అవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధపడ్డా అని సప్తగిరి చెప్పుకొచ్చారు.

  భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాను

  భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాను

  నేను దర్శకుడు అవ్వాలని వచ్చాను, భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాను. దర్శకత్వం చేయకపోయినా కథలు అందిస్తా. అల్లు అర్జున్‌కి కొన్ని కథలు చెప్పించా. ఎందుకంటే అంతపెద్ద స్టార్‌కు కథ చెప్పటం అంటే మాటలు కాదు.. అలా చేస్తే కొత్తవారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని... సప్తగిరి తెలిపారు.

  సప్తగిరికి గర్వం పెరిగింది

  సప్తగిరికి గర్వం పెరిగింది

  సప్తగిరి గర్వం బాగా పెరిగింది అనే కామెంట్ చాలాసార్లు వినిపించింది. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. చాలా తక్కువ సమయంలో నేను ఈ స్థాయికి ఎదిగాను. అన్నీ ఉన్నా కొందరు అవకాశాలు తెచ్చుకోలేక పోతున్నారు. నేను ఎదగడం వారికి ఇబ్బందిగా అనిపించి నాపై అలా ప్రచారం చేస్తున్నారేమో? అని సప్తగిరి వ్యాఖ్యానించారు.

  English summary
  Telugu actor Saptagiri recently participated in the TV show, which is hosted by Ali. On this occasion Saptagiri explained about his film career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X