»   » పూరి జగన్నాథ్ ‘జ్యోతిలేక్ష్మి’ రేపే

పూరి జగన్నాథ్ ‘జ్యోతిలేక్ష్మి’ రేపే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఛార్మి, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘జ్యోతిలక్ష్మి' . షూటింగ్ మొదలు పెట్టిన రెండు నెలల్లోనే పూరి షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రం రేపు ఉదయం ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం తో ఛార్మీ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 20న మొదలైన ఈ సినిమా షూటింగ్ కంటిన్యూ షెడ్యూల్ తో ఏప్రిల్ 29తో ముగిసింది.

అలాగే ఇంక ఆలస్యం చేయకుండా ...ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఉమెన్స్ డే కానుకగా ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని మరియు టైటిల్ లోగోని ని రిలీజ్ చేసారు. కానీ సినిమాలో చార్మీ జ్యోతి లక్ష్మీగా ఎలా ఉండనుందనే ఫస్ట్ లుక్ ని మాత్రం రిలీజ్ చెయ్యలేదు. అందుకే ఈ చిత్ర టీం ఛార్మీ జాతి లక్ష్మీ ఫస్ట్ లుక్ ని రేపు ఉదయం రిలీజ్ చేయటంతో పూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

All eyes on Jyothi Lakshmi’s first look

ఈ చిత్రంలో ఛార్మి టైటిల్ పాత్రలో పోషిస్తోంది. అయితే ఈ సినిమాలో ఛార్మి సెక్స్ వర్కర్‌గా కనిపించనుందని సమాచారం. ఓ సెక్స్ వర్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం జ్యోతిలక్ష్మి. మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి 'మిసెస్ పరాంకుశం' అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది.

ఈ నవలలో మిసెస్ పరాంకుశం అనే ఓ సెక్స్ వర్కర్ పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ఎలా గడుపుతుందనే అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే కథను కొన్ని మార్పులతో 'జ్యోతిలక్ష్మి'గా తెరకెక్కిస్తున్నారట. మరి పూరి, ఛార్మిని ఏరకంగా చూపిస్తారో వేచి చూడాలి.

All eyes on Jyothi Lakshmi’s first look

ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఓ హార్డ్ హిట్టింగ్ పాయింట్ తో పూరి ఈ సినిమా తీసాడని చెప్తున్నారు. చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. సికె ఎంటర్ టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

English summary
Puri Jagan 's woman-centric flick ‘Jyothi Lakshmi’ first look of this film will be unveiled tomorrow.
Please Wait while comments are loading...