»   » పవన్ కళ్యాణ్ మీద బ్లాక్ మెయిలింగ్, లూటీ ఆరోపణలు!

పవన్ కళ్యాణ్ మీద బ్లాక్ మెయిలింగ్, లూటీ ఆరోపణలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద బ్లాక్ మెయిలింగ్, లూటీ ఆరోపణలు చేస్తున్నారు అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సభ్యులు. 'కాటమరాయుడు' సినిమా రిలీజ్ సందర్భంగా కోట్ల రూపాయలు వెనకేసుకోవడమే లక్ష్యంగా సామాన్యులకు సినిమాను దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

'కాటమరాయుడు' సినిమా మొదటి మూడు రోజుల్లోనే 30 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యంతో టిక్కెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని... రూ. 10 టికెట్ 50, రూ. 50 టికెట్ రూ. 200, రూ. 150 టికెట్లను రూ. 500లకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు.

బెనిఫిట్ షో టికెట్స్ వేలల్లో

బెనిఫిట్ షో టికెట్స్ వేలల్లో

అభిమానుల వీక్ నెస్ అడ్డుపెట్టుకుని కాటమరాయుడు బెనిఫిట్ షో టికెట్స్ రూ. 2 వేల నుండి 5 వేల వరకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లూటీ చేయడమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం

లూటీ చేయడమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం

ప్రభుత్వాలను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ సామాన్యులను లూటీ చేయడమే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం అని అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సభ్యులు కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

పోరాటం ఆగదు

పోరాటం ఆగదు

టికెట్ రేట్ల పెంపుపై ఇప్పటికే కోర్టులో కేసు వేసామని, సామాన్యులకు టికెట్ల రేటు అందుబాటులోకి వచ్చే వరకు పోరాటం ఆగదని భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సభ్యులు స్పష్టం చేసారు.

కాటమరాయుడు

కాటమరాయుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' ఈ నెల 24న గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. కిషోర్ పార్దసాని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాత.

నిస్సిగ్గుగా, నిజాయితీగా...: పవన్ రాజకీయ సందేశం, అభిమానులకు ఉపదేశం!

నిస్సిగ్గుగా, నిజాయితీగా...: పవన్ రాజకీయ సందేశం, అభిమానులకు ఉపదేశం!

నాకు ఏ పని ఇచ్చినా సరే అది తోట పని కావచ్చు, వీధులు ఊడ్చే పని కావచ్చు. ఎలాంటి పనైనా సరే నిస్సిగ్గుగా, చాలా నిజాయితీగా పని చేస్తాను. సినిమాలు కూడా నాకు భగవంతుడు ఇచ్చిన బిక్ష అనుకుని ఎంత కృతజ్ఞతగా చేయాలో, ఎంత ఒళ్లు దగ్గర పెట్టుకుని చేయాలో ఇన్ని సంవత్సరాలు అంతే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేసాను. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కానీ అంతే ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తాను.... అని పరోక్షంగా తన రాజకీయ ప్రయాణం గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 కోట్లలో ఒక్కడు... అంటూ పవన్ గురించి త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్!

కోట్లలో ఒక్కడు... అంటూ పవన్ గురించి త్రివిక్రమ్ ఎమోషనల్ స్పీచ్!

పవర్ స్టార్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎమోషన్ గా స్పందించారు. దేవుడు కొన్ని శక్తులు కోట్లలో ఒకకరికే ఇస్తాడు... అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ త్రివిక్రమ్ గొప్పగా చెప్పుకొచ్చారు..

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ట్రైలర్


కాటమరాయుడు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో అభిమానులను అలరించబోతున్నాడు.

English summary
All india film audience consumers union protest on Katamarayudu ticket price hike. Katamarayudu is an upcoming Telugu language film directed by Kishore Kumar Pardasani which features Pawan Kalyan and Shruti Haasan in the lead roles. It is a remake of Tamil film Veeram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu