twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్యతో గొడవ,వారసత్వం ఇలా... (ఎన్టీఆర్ పూర్తి ఇంటర్వూ)

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'నా వరకు అన్ని సినిమాలు ఆడాలి. నా సినిమా ఆడాలి, బాబాయ్‌ సినిమా ఆడాలి. ‘సోగ్గాడే చిన్నినాయనా' ఆడాలి. ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా' ఆడాలి. నాకు ఎవరితో క్లాష్‌ లేదు. క్లాష్‌ ఉంటే నేను ‘ మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి వెళ్లుండేవాడిని కాదు. నందమూరి హీరోల మధ్య క్లాష్‌ లేదు. నేను ఏది పట్టించుకోవాలో అది పట్టించుకుంటా. ఏది అనవసరం అనుకుంటానో దాన్ని పట్టించుకోను' అంటున్నారు ఎన్టీఆర్.

    ఎన్టీఆర్....ఈ పేరు కోట్లాది అభిమానుల గుండె చప్పుడు. ఒక్కో సినిమాకు ఒక్కో అవతారం ఇలా పదిహేనేళ్ళూ గడిచిపోయాయి. ఆది లో అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ తో తన మాస్ యాక్షన్ మెదలు పెట్టి, యానిమల్ లవర్ అంటా..మనకంటే యానిమల్ ఎవరిక్కడ, అంటూ టెంపర్ సినిమాలో చెప్పిన డైలాగ్ వరకు అన్ని వైవిధ్యమైన పాత్రలతోనే 25 సినిమాలు అలవోకగా చేసేసాడు.

    ‘ఆది', ‘సింహాద్రి', ‘యమదొంగ', ‘అదుర్స్‌', ‘బృందావనం', ‘టెంపర్‌'... ఇలా ప్రతి సినిమాతోనూ అభిమానుల్ని మెప్పిస్తూ, నటుడిగా సినిమా సినిమాకీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ, ఓ అద్బుత అనుభవాన్ని సంపాదించాడు.

    కెరీర్ లో మెదటి సినిమా యావరేజ్ అయినా, తన తరువాత సినిమా స్టూడెంటే నెం-1 గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని, అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఆది, సింహాద్రి సినిమాలు బంపర్ హిట్స్ తో తన స్థితిని ఒక్కసారిగా మార్చేసాయి. ఈ మధ్యలో కొన్ని భారీ ప్లాప్స్ కూడా పలకరించాయి. దానితో కొద్దిగా స్థిమితపడి మళ్ళీ తన ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం మెదలు పెట్టాడు.

    2016 సంక్రాంతికి అభిమానులకు పెద్ద గిఫ్ట్ గా నాన్నకు ప్రేమతో సినిమా అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కెరీర్‌, చిత్ర ప్రయాణం గురించి ఎన్టీఆర్‌ ఇలా మనసు విప్పాడు!

    స్లైడ్ షోలో ...ఆ ఇంటర్వూ చూడండి....

    బాబాయ్‌ తో గొడవ గురించి ...

    బాబాయ్‌ తో గొడవ గురించి ...

    ‘‘నాకెవరితోనూ గొడవల్లేవండీ. నందమూరి హీరోల మధ్య ‘వార్‌' సాగుతోందన్న మాటల్లోనూ నిజం లేదు. ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలొస్తే.. అన్నీ ఆడాలి. మరో విషయం ఏంటంటే.. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత నాకు తప్ప ఇంకెవ్వరికీ లేదు''.

    పుకార్లు పుట్టిస్తున్నారు...

    పుకార్లు పుట్టిస్తున్నారు...

    ఏమీ లేకపోయినా ‘ఏదో ఉంది..' అని పుకార్లు పుట్టిస్తున్నారు. ఎక్కడో జరిగిన రెండు సంఘటనల్ని కలుపుకొని ఏదో ఉందట.. అని రాస్తున్నారు. ‘అట' అని రాస్తే ఫర్వాలేదు... ‘ఉంది' అని ఎవరికి వాళ్లే నిర్ధారించుకొంటే నేనేం చెప్పేది? ఎవరితోనైనా నాకు విభేదాలుంటే నేనే చెప్తా. సత్సంబంధాలుంటే చెప్పాల్సిన అవసరం లేదు.

    ఎవరు చెప్పారు..

    ఎవరు చెప్పారు..

    అయినా బాబాయ్‌తో నాకు పడడం లేదని నేను చెప్పానా, లేదా బాబాయ్‌ ఏమైనా చెప్పారా?. బాబాయ్‌కీ నాకూ పడడం లేదని రకరకాల వార్తలొస్తున్నాయి. వాటిపై స్పందించాల్సిన పని లేదు.

    గుర్తు ఉండదు

    గుర్తు ఉండదు

    ‘‘హీరోగా 15 ఏళ్ల ప్రయాణం.. 25 సినిమాలు. ఈ లెక్కలు గుర్తుకొస్తే ఇంత దూరం ప్రయాణించానా? అనిపిస్తుంది. పరిశ్రమకొచ్చి ఎన్నేళ్లయింది? ఎన్నో సినిమా చేస్తున్నాననే విషయం నాకెప్పుడూ గుర్తుండదు. ఎవరో ‘ఇది నీ 25వ చిత్రం కదా' అన్నారు.

    ప్రయాణం చేస్తూంటా...

    ప్రయాణం చేస్తూంటా...

    నా 25వ చిత్రంతో తల్లిదండ్రులకి అంకితం చేసే ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకొస్తుండడం ఆనందంగా ఉంది. సినిమా చేసేటప్పుడు లెక్కలేసుకోను. మనసుకు నచ్చిన కథలతోనే ప్రయాణం చేస్తుంటా.

    అది అబద్దం...

    అది అబద్దం...

    హిట్టు సినిమా దర్శకులతోనే ఎన్టీఆర్‌ సినిమా చేస్తాడని మధ్యలో కొద్దిమంది ప్రచారం చేశారు. ‘స్టూడెంట్‌ నెం.1'కి ముందు రాజమౌళి సినిమాలే చేయలేదు. ‘బృందావనం'కి ముందు వంశీ పైడిపల్లికి హిట్టుందా? వినాయక్‌, వర ముళ్లపూడి హిట్లిచ్చారనే సినిమాలు చేశానా? వాళ్లు చెప్పిన కథలు నా మనసుకు నచ్చడంతోనే వాళ్లతో ప్రయాణించా.

    అన్నీ సూపర్ హిట్సే...

    అన్నీ సూపర్ హిట్సే...

    నకు నచ్చింది కాబట్టి... బయటి వాళ్లకూ నచ్చాలని లేదు. నాకు నచ్చినవన్నీ ప్రేక్షకులకు నచ్చితే ఇక అన్నీ సూపర్‌హిట్లే. మనుషులు, మనుషుల్లా ఉండాలి కాబట్టి దేవుడు అప్పుడప్పుడు మొట్టికాయ వేస్తుంటాడు. ఆతప్పులు నుంచి మనం మరిన్ని నేర్చుకొంటాం.

    వాటికీ రెడీనే...

    వాటికీ రెడీనే...

    ప్రేక్షకులని ఒప్పించగలం అనే నమ్మకాన్ని ఏ దర్శకుడైనా కలిగిస్తే భవిష్యత్తులో ‘సాగరసంగమం', ‘శంకరాభరణం' లాంటి సినిమాలు చేయడానికైనా రెడీనే.

    కోరిక ఉంది కానీ భయం...

    కోరిక ఉంది కానీ భయం...

    పౌరాణికాల్లో నటించాలనే కోరిక కూడా ఎప్పట్నుంచో ఉంది. కానీ పౌరాణికాలన్నప్పుడు నాలో తాతగారితో పోల్చి చూస్తారనే ఒక భయం కూడా కలుగుతుంటుంది.

    ఆయనలా మరొకరు ఉండరు..

    ఆయనలా మరొకరు ఉండరు..

    నందమూరి తారక రామా రావులాగా మరొక వ్యక్తి ఉండరు, జన్మించరు కూడా. నేను ఆయన వారసుడిని కాదు... ఆయన మనవడిని మాత్రమే అని చెప్పుకుంటా. ఈ జన్మకిది చాలు''.

    అబ్బాయికో గిఫ్ట్....

    అబ్బాయికో గిఫ్ట్....

    ‘‘నా ప్రయాణంలో మా అబ్బాయి చూడబోయే మొదటి సినిమా ఇదే. ఈసినిమా డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు వీలైనంత త్వరగా ఈ సినిమాని అమ్మనాన్నకు, మా అబ్బాయి అభయ్‌కీ, అన్నయ్యకీ చూపించాలనుకొన్నా. నిజంగా ఇలాంటి కథలు అరుదుగా దొరుకుతుంటాయి.

    టైటిల్ ఎందుకంటే..

    టైటిల్ ఎందుకంటే..

    ఈ సినిమాకు ఏ పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు సుకుమార్‌ సినిమాలు గుర్తుకొచ్చాయి. సినిమా చివర్లో అమ్మానాన్నలకి ప్రేమతో అని రాస్తుంటారు. అది గుర్తుకొచ్చి ‘నాన్నకు ప్రేమతో అని పెడితే ఎలా ఉంటుంది సర్‌' అన్నా. ‘చాలా బాగుంటుంది, ఇదే పెట్టేద్దాం' అన్నారాయన. నాన్నకు ప్రేమతో' అనే పేరు తట్టడం కూడా ఈ కథ గొప్పదనమే.

    ఓ డైలాగ్, సింబల్

    ఓ డైలాగ్, సింబల్

    ఈ సినిమాలో ‘అందరూ టైమ్‌ని సెకండ్లలోనూ, నిమిషాల్లోనూ కొలుస్తారు. కానీ నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తుంటా' అనే డైలాగ్‌ ఉంది. ఆ డైలాగ్‌ నుంచి పుట్టిందే సినిమా లోగోకు మధ్యలో ఉన్న గుండె చప్పుడు గుర్తు. అది నేను సూచించిందే అని సుకుమార్‌గారు చెప్పడం ఆయన గొప్పతనం. కానీ నాకు ఆయన చెప్పిన డైలాగ్‌తోనే ఆ చిహ్నం గుర్తుకొచ్చింది''.

    సుకుమార్ గురుంచి

    సుకుమార్ గురుంచి

    ‘‘సుకుమార్‌ సినిమాలంటే నాకు బాగా ఇష్టం. ‘జగడం', 1 (నేనొక్కడినే) బాగా తీశారు. ‘టెంపర్‌' తరవాత సుకుమార్‌ చెప్పిన కథ బాగుందనుకున్నా, కాని ఆ తర్వాత ఆయన నాన్నగారు చనిపోయారు. కొన్ని రోజులకు సుకుమార్‌ వచ్చి ‘ఓ కథ రాశా వింటారా' అని ‘నాన్నకు ప్రేమతో' కథ వినిపించారు. ‘అదిరిపోయింది' అనేశా.

    అద్బుతమనిపించింది..

    అద్బుతమనిపించింది..

    తండ్రి చనిపోయిన క్షణాల్లో ఆయన కోసం ఏమైనా చేయాలి.. అనుకొని ఈ కథ రాయడం.. అద్భుతమనిపించింది. సుకుమార్‌ నిజంగానే ఇక్కడుండాల్సినవాడు కాదు. ఆయన ఆలోచనలు గమ్మత్తుగా ఉంటాయి.

    ఐదు నెలలు కష్టపడ్డా

    ఐదు నెలలు కష్టపడ్డా

    ‘నాన్నకు ప్రేమతో' అనగానే అందరూ నా గెడ్డం గురించే మాట్లాడుతున్నారు. అదో బ్రాండ్‌ అయిపోయిందిప్పుడు. చూడ్డానికి బాగుంది కానీ, దాన్ని పెంచుకోవడానికీ, షూటింగ్‌ జరిగినన్నాళ్లు ఉంచుకోవడానీ చాలా కష్టపడ్డా (నవ్వుతూ). ఫిబ్రవరి నుంచి ఐదు నెలలు ఈ గడ్డం గురించే కష్టపడ్డా.

    తొలిసారి భయం

    తొలిసారి భయం

    తొలిసారి ఈ గెటప్‌ ని అద్దంలో చూసుకొంన్నప్పుడు భయం వేసింది. అభిమానులు ఏం అనుకొంటారు? వాళ్లు చూస్తారా, లేదా? అనిపించింది.

    అనుమానాలన్నీ పోయాయి...

    అనుమానాలన్నీ పోయాయి...

    ఎప్పుడైతే ఫస్ట్‌లుక్‌ విడుదల చేశామో.. అప్పుడు నా అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అభిమానులకు లుక్‌ విపరీతంగా నచ్చింది. గెడ్డం ఎప్పుడైతే తీసేసి మామూలు లుక్‌కి వచ్చేశానో.. ఇప్పుడు హాయిగా అనిపిస్తోంది''

    నేనే చిన్న పిల్లాడిలా

    నేనే చిన్న పిల్లాడిలా

    ‘‘నేనే చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తుంటా. నేనే అనుకుంటే మా అబ్బాయి అభయ్‌ అల్లరి ఇంకా ఎక్కువ (నవ్వుతూ). నేను కనిపించానంటే నాన్నా అంటూ వెంటపడుతుంటాడు. తనకి మొదట వచ్చిన మాటే నాన్న. వాడు స్టార్‌ కొడుకు అన్న మాటకు దూరంగా పెరగాలన్నది నా కోరిక.

    పార్క్ కు తీసుకు వెళ్తాం

    పార్క్ కు తీసుకు వెళ్తాం

    వాణ్ని ఇంట్లోనే ఉంచేయకుండా ప్రణతి రోజూ ఇంటి పక్కనున్న పార్క్‌కి తీసుకెళుతుంటుంది. అందరి పిల్లలతో ఆడుకోనిస్తుంది. చదువుకొనే వయసులోనూ, అల్లరి చేసే వయసులో నేను సినిమాలతో బిజీ అయిపోయా. నేను అప్పట్లో ఏమేం కోల్పోయానో అవన్నీ మా అబ్బాయి ఆస్వాదించాలన్నదే నా కోరిక''.

    దేవీకి హ్యాట్సాఫ్‌

    దేవీకి హ్యాట్సాఫ్‌

    నాన్నపై అత్యంత ప్రేమ ఉన్న ఏడెనిమిది మంది కలసి తీసిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌కీ వాళ్ల నాన్నంటే చెప్పలేనంత అభిమానం.

    ఏం చేయాలో అర్దం కాలేదు...

    ఏం చేయాలో అర్దం కాలేదు...

    ‘అదుర్స్‌' కోసం పాట పాడుతున్నప్పుడు తొలిసారి సత్యమూర్తి గారిని కలుసుకొన్నా! గొప్ప వ్యక్తి. దురదృష్టవశాత్తూ.. ఈ మధ్యే చనిపోయారు. నిర్మాణానంతర కార్యక్రమాలు అప్పుడే వూపందుకొన్నాయి. ఆ సమయంలో ఏం చేయాలో మాకెవ్వరికీ అర్థం కాలేదు. మనసంతా స్తబ్దుగా అయిపోయింది.

    హ్యాట్యాఫ్

    హ్యాట్యాఫ్

    రెండు రోజుల తర్వాత దేవినే మెసేజ్‌ చేశాడు. ‘ఈ రోజే రఘు దీక్షిత్‌తో ఓ పాట పాడించా.. వర్క్‌ మొదలెడుతున్నా..' అని సెల్‌ఫోన్‌ సందేశం పంపాడు. పని పట్ల తనకున్న అంకితభావానికి హ్యాట్సాఫ్‌...''

    నా మైండ్ సెట్ ను, లుక్ ని మార్చేసాడు

    నా మైండ్ సెట్ ను, లుక్ ని మార్చేసాడు

    నా మైండ్‌ సెట్‌ని మార్చిన దర్శకుడు రాజమౌళి. అంతేకాదు ‘యమదొంగ'తో నా లుక్‌నీ మార్చేశాడు..! సన్నబడాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది. కానీ ఎందుకో సంశయించేవాణ్ని. ‘నువ్వు దూకాల్సిందే' అని వెనుక ఎవరో నిలబడితే గానీ.. మనం దూకం. నా వెనుక అలా నిలబడిన వ్యక్తి.. రాజమౌళి.

    రాజమౌళితో మళ్లీ ఎప్పుడు...

    రాజమౌళితో మళ్లీ ఎప్పుడు...

    తనతో మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారు? అని అందరూ అడుగుతుంటారు. అది నా చేతుల్లో లేదు. ఆయనే నిర్ణయించాలి. అయినా ఎంతసేపూ మనతోనే చేస్తే, ఆయన బయటకు ఎప్పుడు వెళ్తాడు? తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్‌కి తీసుకెళ్లే సత్తా ఆయనది. అలాంటి దర్శకుణ్ని ఇక్కడికే పరిమితం చేయకూడదు''.

    నాన్న నేర్పిన పాఠం

    నాన్న నేర్పిన పాఠం

    ‘మీ కెరీర్‌ మీదే.. మీరే మార్గంలో వెళ్తారో అది మీ ఇష్టం' అని నాన్న చెప్పేవారు. నేనూ అన్నయ్య సినిమాల్లోకి వచ్చాం. మా తొలి సినిమా అయిపోయాక ఇద్దరినీ పిలిచారు.

    అవి వాళ్లకూ కూడా...

    అవి వాళ్లకూ కూడా...

    ‘ఓ సినిమా వరకే నేను మీతో ఉన్నాను. ఇక నుంచి మీ తప్పుల్ని మీరే సరిదిద్దుకోండి. మీ గెలుపు కోసం మీరే కష్టపడండి. మీ ఫలాలు మీరే అనుభవించండి. వెనుక మా నాన్న ఉన్నాడనే ధైర్యం వద్దు' అన్నారు. మేమూ అలానే నడుచుకొన్నాం. ఏం చేయాలో, ఏం చేయకూడదో నేర్చుకొన్నాం. ఈ అనుభవాలే మా పిల్లలతో పంచుకొంటాం. అవి వాళ్లకూ పాఠాల్లా ఉపయోగపడతాయి''.

    ప్రణతి ఆమ్లెట్‌ తో కుస్తి

    ప్రణతి ఆమ్లెట్‌ తో కుస్తి

    నేను వంట బాగా చేస్తా కానీ... ప్రణతికి వంట రాదు. జీవితంలో తను ఒకేసారి కేక్‌ చేయడానికి ప్రయత్నించింది. అది మాడిపోయింది. ఆ దెబ్బకి ‘మేడమ్‌ని వంట చేయడం ఆపేయమనండి సార్‌' అంటూ మా కుక్‌ పారిపోయాడు. తను మళ్లీ తిరిగి రాలేదు (నవ్వుతూ). అప్పట్నుంచి అతి కష్టంగా ఆమ్లెట్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది''.

    మారిపోయింది...

    మారిపోయింది...

    ‘‘ప్రణతి వచ్చాక నా జీవితం చాలా మారిపోయింది. తను నాపై ఫోకస్‌ పెంచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రణతి మరో అమ్మ నాకు. నాలో ఒక పిల్లాడు ఉంటాడు. వాడిని ఎప్పుడూ అలాగే ఉంచుతూ ఉంటుంది. తను నాకిచ్చిన గొప్ప కానుక ఏంటంటే... అభయ్‌. అందుకోసం తిరిగి తనకి ఏం ఇవ్వాలో తెలియదు.

    ‘ఊపిరి' అందుకే చేయలేదు..

    ‘ఊపిరి' అందుకే చేయలేదు..

    ‘ఊపిరి'లో నాగార్జునగారితో నేను చేయాల్సింది. కానీ ‘నాన్నకు ప్రేమతో' సినిమా డేట్లు, ‘ఊపిరి' డేట్లతో క్లాష్‌ కావడం వల్ల చేయలేకపోయాను. ఆ విషయాన్ని వారితో స్పష్టంగా చెప్పి నేను తప్పుకున్నా.

    English summary
    NTR thrashed the reports that all isn't well between him and his babai Balakrishna ever since the flexi controversy erupted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X