»   » అన్నీ అవే పోలికలు కానీ...! జీవా ఈ సారి రంగం లో గెలుస్తాడా

అన్నీ అవే పోలికలు కానీ...! జీవా ఈ సారి రంగం లో గెలుస్తాడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి. చౌదరి తనయుడు జీవా హీరోగా 2011 లో విడుదల అయినా రంగం సినిమా ఎంతటి ఘనవిజయం సాదించిందో తెలిసిందే, అనువాద చిత్రాల్లో భారీ విజయం సాధించిన సినిమాలో రంగం ఒకటి, రాధ కూతురు కార్తీక హీరోయిన్ గా పరిచయం అయింది ఈ సినిమాతోనే. 'రంగం' ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ కె.వి.ఆనంద్‌ దర్శకుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంలో జీవా సరసన నిన్నటి తరం బ్యూటీక్వీన్‌ రాధ పెద్ద కుమార్తె కార్తీక నటించింది. ఈ చిత్రాన్ని మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు తెస్తూ.. జీవా నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన 'యాన్‌' అనే చిత్రం 'రంగం2' పేరుతో ముస్తాబవుతోంది...

All set for Rangam 2 audio launch

ఈ సినిమాలో రెండు విశేషాలున్నాయి అనుకోకుండానే జరిగినా ఈ రెండూ "రంగం సెంటిమెంట్ ని బల పరిచేలాగే ఉన్నాయి అవేమిటంటే... సినిమాటోగ్రాఫర్‌ టర్న్‌డ్‌ డైరెక్టర్‌ కె.వి.ఆనంద్‌ దర్శకత్వంలో రంగం వచ్చింది.ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ కూతురైన కార్తీక ఇందులో హీరోయిన్ గా చేసింది... ఈ కాంబినేషన్ లో అప్పట్లో "రంగం" తమిళ తెలుగు భాషల్లోనూ పెద్ద హిట్ అనిపించుకుంది... అప్పట్లాగే ఇప్పుడు ఈ రంగం-2 కి దర్శకత్వం వహించిన రవి కే చంద్రన్ కూడా ఒకప్పుడు సినిమాటోగ్రాఫరే... అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ కూడా రాధ చిన్న కూతురు తులసీ నాయర్... ఈ రెండిటికీ మరో యాడెడ్ ఎట్రాక్షన్ ఏమిటంటే ఆ రంగం కు సంగీత సారధ్యం వహించిన హ్యారిస్‌ జైరాజ్‌ దీనికి కూడా సంగీతం అందించారు. ఇదీ మరి విశయం... సో..! ఇంకో విజయం ఖాయమే నన్నమాట..

All set for Rangam 2 audio launch

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎన్‌. బాలాజి నిర్మించిన ఈ చిత్రానికి రవి కె. చంద్రన్‌ దర్శకత్వం వహించారు. నాజర్‌, జయప్రకాశ్‌, వూర్మిళ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం 'రంగం 2' డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 'రంగం-2' గీతాలు అతి త్వరలో విడుదల కానున్నాయి. హీరోహీరోయిన్‌లు జీవా తులసీ నాయర్‌తోపాటు సంగీతదర్శకులు హ్యారిస్‌ జైరాజ్‌ సమక్షంలో 'రంగం-2' ఆడియో వేడుక వైభవంగా నిర్వహించేందుకు చిత్ర నిర్మాత ఎ.ఎన్‌.బాలాజీ (సూపర్‌గుడ్‌ బాలాజీ) సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Tamil hero Jeeva's Rangam 2 in the Direction of Ravi K chandran Telugu Movie audio Coming Soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu