»   » మొత్తం పాటలు తీసేసి ... '1- నేనొక్కడినే'

మొత్తం పాటలు తీసేసి ... '1- నేనొక్కడినే'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్‌ ఈసారి '1, నేనొక్కడినే' అంటూ సంక్రాంతి సంబరాలు చేయటానికి వచ్చాడు. జనవరి 10 న విడుదల అయిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా కథ,కథనాలు చాలా క్లిష్టంగా ఉన్నాయని టాక్ వ్యాపించినా ఓ వర్గం ఆదరణ బాగానే చూరగొంటోంది. రాజమౌళి వంటి దర్శకులు పాత్ బ్రేకింగ్ మూవి అంటూ దీన్ని ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ కు పంపుతున్నట్లు సమాచారం. దాంతో వారి సౌలభ్యం కోసం పాటలు తొలిగించి,ట్రిమ్ చేసిన వెర్షన్ ని రెడీ చేస్తున్నారు.

ఈ విషయమై సుకుమార్ మాట్లాడుతూ... ఫిల్మ్ ఫెస్టివల్స్ కి అవసరమైన రన్ టైం కోసం,మేము పాటలు తొలిగించాలని అనుకుంటున్నాం...అప్పుడు లెంగ్త్ తగ్గి మరింత చిన్నది అవుతుంది అన్నారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ చిత్రం ఖచ్చితంగా అవార్డ్ లు సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ..లెంగ్త్ ఎక్కువయ్యిందని విమర్శలు రావటంతో ఇరవై నిముషాల వరకూ ట్రిమ్ చేసి వదిలారు.

All Songs to be deleted from ‘1-Nenokkadine’

'దూకుడు' చిత్రం తరువాత మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం '1' నేనొక్కడినే.. చిత్రం జనవరి 10న విడుదల అయ్యింది. ఈ చిత్రం మన దేశంతో పాటు జపాన్‌, రష్యా, అమెరికా, కొరియాల్లో ఆయా ప్రాంతీయ భాషల సబ్‌టైటిల్స్‌తో విడుదల కానుంది.

ఇక '1' సినిమా చూసిన ప్రతి ఒక్కరు మహేష్‌ నటన గురించి, సుకుమార్‌ దర్శకత్వం గురించే మాట్లాడుకుంటారు. టాలీవుడ్‌లో చిత్రీకరించిన హాలీవుడ్‌ స్థాయి సినిమాగా '1' నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర. వీరు నిర్మాతలుగా తెరకెక్కించిన చిత్రం '1'. మహేష్‌బాబు, కృతిసనన్‌ జంటగా నటించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary

 Mahesh Babu and Sukumar creative extravagant bonanza 1 Nenokkadine. By viewing the response the makers are planning to send ’1′ to upcoming international film fests.The length of the movie stood as constraint for screening in film fests and the makers of ’1 Nenokkadine’ have decided to do away with all the five songs from the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu