»   » అక్కినేని పెళ్ళిలో కనిపించేది కొందరే..!? కేవలం సన్నిహితులకే ఆహ్వానం

అక్కినేని పెళ్ళిలో కనిపించేది కొందరే..!? కేవలం సన్నిహితులకే ఆహ్వానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని వారి ఇంట పెళ్ళిసందడి మొదలయ్యింది .నాగార్జున కొడుకు నాగచైతన్య హీరొయిన్ సమంత ప్రేమిచుకొని పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలను ఒప్పించారు నిశ్చితార్థం కూడ జరుపుకున్న సంగతి అందరి తెలిసిన విషయమే అయితే తాజాగ పెళ్ళిముహుర్తం కూడ ఫిక్స్ అయింది .అక్టోబరు 6 వ తేదీన గోవాలో పెళ్లి జరుగనుంది. గోవాలో ఇరు సంప్రదాయాల పద్ధతుల్లో రెండు సార్లు ఈ ప్రేమ జంట ఒక్కటికాబోతోంది. ఎప్పుడు ఎవ్వరు పెళ్లి చేసుకొని విధంగా వీరిద్దరూ పెళ్లి బంధం ఒకటవుతుండడంతో టాలీవుడ్ మొత్తం ఈ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. .దీనికొరకు వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింటు చేయించారు.

రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా

రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా

వివాహానికి కొందరు దగ్గరి బంధువులు మాత్రమే రాబోతున్నారట. తక్కువ మంది మధ్యలో పెళ్ళి తర్వాత రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా జరుగుతుందీ అంటూ గతం లో ఒక సారి నాగార్జున ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు కూడా. అయితే చైతు పర్సనల్ గా కేవలం తన క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే ఇన్విటేషన్స్ ఇస్తున్నాడని టాక్.

ఎన్టీఆర్ కూడా చైతూకి చాలా క్లోజ్

ఎన్టీఆర్ కూడా చైతూకి చాలా క్లోజ్

ఇక టాలీవుడ్ హీరోల్లో రానా చైతూకి బాగా క్లోజ్. అలాగే ఇద్దరు దగ్గరి బందువులే కాబట్టి రానా డౌట్ లేకుండా వస్తాడు. ఇక ఎన్టీఆర్ కూడా చైతూకి చాలా క్లోజ్. నాగ్ కూడా ఎన్టీఆర్ ని చాలా ఇష్టపడతారు. సో ఎన్టీఆర్ కి స్పెషల్ ఇన్విటేషన్ అందుతుంది ఉందని తెలుస్తోంది.

నితిన్ అండ్ శిరీష్

నితిన్ అండ్ శిరీష్

చైతూకి నితిన్ అండ్ శిరీష్ కూడా బాగానే టచ్ లో ఉంటారు. వీరు అప్పుడపుడూ లాంగ్ డ్రైవింగ్ లకు కూడా వెళతారు. మరి వీరిని గోవాకు చైతూ పిలుస్తాడో లేదో చూడాలి. అలాగే నాగ్ తరుపున చిరంజీవి.. అల్లు అరవింద్.. నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు వచ్చే ఛాన్సుంది.

క్లోజ్ ఫ్రెండ్స్ మరియు దగ్గరి బందువులు

క్లోజ్ ఫ్రెండ్స్ మరియు దగ్గరి బందువులు

ఇక సమంత తరపునుండి మాత్రం తన క్లోజ్ ఫ్రెండ్స్ మరియు దగ్గరి బందువులు హాజరుకానున్నారట.. ఇక తన పర్సనల్ స్టైలిస్ట్ నీరాజా కోనని కూడా సమంత పిలవనుందట. అలాగే తన సినిమాలకి ఎప్పటి నుండో డబ్బింగ్ చెబుతున్న సింగర్ చిన్మయి ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ కు కూడా స్పెషల్ గా ఇన్విటేషన్ ను ఇచ్చేసిందట.

అంతా సెట్ అయిపోయింది

అంతా సెట్ అయిపోయింది

మొత్తానికి అక్కినేని వారి పెళ్లి వేడుక అంతా సెట్ అయిపోయింది. ఇక వేడుకలో ఎవరు పాల్గొంటారో వారే అసలైన అక్కినేని ఆత్మీయులు అని చెప్పవచ్చు. చూద్దాం ఎవరెవరు వస్తారో.. వెయిట్ అండ్ సి. అక్టోబర్ 6 అండ్ 7న గోవాలో హిందూ అండ్ క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్ళి జరగనుంది.

English summary
The wedding in Goa will have a select guest list while the couple have invited all their colleagues and friends for the reception.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu