»   » 20 సంవత్సరాల ల్యాబ్ ల్లో మగ్గి ఈ రోజు రిలీజ్ అవుతోంది

20 సంవత్సరాల ల్యాబ్ ల్లో మగ్గి ఈ రోజు రిలీజ్ అవుతోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోండుల సమస్యల్ని పరిష్కరించడం కోసం కృషి చేసి ప్రాణత్యాగం చేసిన కొమరం భీమ్‌ చరిత్రతో రూపొందిన చిత్రం 'కొమరం భీమ్‌'. ఈ చిత్రం ఈ రోజు(జూలై 2)న విడుదలవుతోంది. భూపాల్‌రెడ్డి ప్రధాన పాత్రధారిగా చేసిన ఈ చిత్రాన్ని అల్లాణి శ్రీధర్‌ డైరక్ట్ చేసారు. ఇక ఈ చిత్రం దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పటికి ల్యాబ్ బంధనాలు తెంచుకుని బయిటపడుతోంది. తెలంగాణా ఉద్యమం పుంజుకోవటం, ఆ తరహా సినిమాలపై ఆసక్తి పెరగటంతో దీనిని బయిటకు తీసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్సకుడు అల్లాడి శ్రీధర్ మాట్లాడుతూ "ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు ఆధునిక హంగుల్ని దిద్ది, ఓ కొత్త సినిమాలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇందులోని ఏడు పాటల్ని భూపాల్‌రెడ్డి రాశారు. గౌతమ్‌ ఘోష్‌ మంచి సంగీతాన్ని అందించార'న్నారు. గిరిజన శాఖ, ఎఫ్‌.డి.సి, కొమరం భీమ్‌ ఫౌండేషన్ ‌ల సహకారంతో విడదలవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు భూపాల్‌రెడ్డి. మౌనిక, తెలంగాణా శకుంతల, బ్యాంక్‌ ప్రసాద్‌, ప్రాణ్‌రావు, యాదగిరి, రేణుమానుబాషా తదితరులు నటించారు. రచన, సంభాషణలు: ఎస్‌.ఎమ్‌.ప్రాణ్‌రావు, కెమెరా: కె.భవానీశంకర్‌, నిర్మాణం: ఆదివాసి చిత్ర ఫిలిమీడియా ప్రొడక్షన్స్‌.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu