»   »  'రాం లీల' సినిమాపై నిషేధం

'రాం లీల' సినిమాపై నిషేధం

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలహాబాద్‌: సంజయ్‌ లీలా భన్సాలీ చిత్రం 'గోలియోం కి రాస్‌లీలా రాం-లీల' సినిమాని అలహాబాద్‌ హైకోర్టు ఉత్తరప్రదేశ్‌లో ప్రదర్శించకుండా నిషేధం విధించింది. భగవాన్‌ రాంలీలా సమితి తరఫున దాఖలైన పిటిషన్‌ ఆధారంగా న్యాయమూర్తులు దేవీప్రసాద్‌ సింగ్‌, అశోక్‌పాల్‌సింగ్‌లతో కూడిన లక్నో ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రంలో పలు వివాదాస్పద, అభ్యంతరకర సంభాషణలున్నాయని, సెన్సార్‌ సర్టిఫికెట్‌ రద్దు చేయాలని దరఖాస్తుదారు కోరారు.

మరో ప్రక్క రామ్ లీలా కు బజరంగ్ దళ్ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. రామ్ లీలా చిత్రంలోని సన్నివేశాలు హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయనే ఆరోపణలతో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణంలో ప్రదర్శనను భజరంగ్ దళ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఐదు సినిమా హాల్స్ లో రామ్ లీలా ప్రదర్శనను అడ్డుకున్నట్టు ఇండోర్ బజరంగ్ దల్ డివిజన్ కన్వీనర్ తెలిపారు. ఈ చిత్రంలో అనేక అశ్లీల సన్నివేశాలున్నాయని, హనుమాన్ డ్యాన్స్ హిందువుల మనోభావాల్సి దెబ్బతీసే విధంగా ఉందని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాంతో చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సినిమా హాల్స్ కు పోలీసులు భద్రత కల్పించారు.

రామ్ లీలా చిత్ర టైటిల్ భారతీయ పురాణం రామ్ లీలాతోకాని, కృష్ణ భగవానుడి 'రాస్ లీలా'తో ఎలాంటి సంబంధం లేదని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. రామ్ లీలా చిత్రం విలియమ్ షేక్ స్పియర్ 'రోమియో అండ్ జూలియట్' నవల స్పూర్తితో రూపొందించాను అని తెలిపారు. రాముడికి సంబంధించిగాని, కృష్ట భగవానుడికి కథకు సంబంధించిన చిత్ర కాదని, భారత పురాణాలతో ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు అని భన్సాలీ అన్నారు.

English summary
Sanjay Leela Bhansali' ‘Ram Leela’ starring Ranbir Kapoor and Deepika Padukone ran into trouble in UP when Allahabad High Court banned “Goliyon ki raasleela Ram-Leela" in Uttar Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu