»   » 100 సినిమా షూటింగ్ మొత్తం భీమవరం లోనేనట

100 సినిమా షూటింగ్ మొత్తం భీమవరం లోనేనట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆలూ లేదూ చూలూ లేదూ.... అని ఒక సామెతుంది. సరిగ్గా ఇలాంటి సంగతే ఒకటి చెప్పాడు నవ్వుల హీరో అల్లరి నరేష్. అటు హాఫ్ సెంచురీ అయిపోగానే ఏకంగా 100 సినిమా మీ ఊళ్ళోనే అంటూ కామెడీ చేసేసాడు. అల్లరి నరేశ్ తన 100వ సినిమా షూటింగ్ మొత్తం భీమవరంలో జరిగేలా చేస్తానని చెప్పాడు. భీమవరం వెళ్లిన ఆయన ఇలా ఆ ఊరికే మాట ఇచ్చాడు

ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ .. నవ్విస్తూ వుండే అల్లరి నరేశ్, భీమవరంలో జరిగే మావుళ్లమ్మ ఫెస్టివల్ కి ముఖ్య అతిథిగా వెళ్లి ఆలయ కమిటీచే సత్కారాన్ని అందుకున్నాడు. ఎస్వీ రంగారావు .. అల్లు రామలింగయ్య వంటి వారికి సత్కారం జరిగిన వేదికపై, తనని సత్కరించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంలోనే ఆయన తన 100వ సినిమాను గురించి ప్రస్తావించాడు. ఇప్పటివరకూ తాను 50 సినిమాలను పూర్తిచేశాననీ, తన 100 సినిమా షూటింగ్ మొత్తం భీమవరంలోనే జరిగేలా చూస్తానంటూ ఆ ఊరుపై తనకి గల అభిమానాన్ని చాటుకున్నాడు.2002 లో అల్లరి తో మొదలైన నరేష్ సినీ ప్రస్తానం లో ఈ పదిహేనేళ్ళలో 50 సినిమాలు చేసాడు. కామెడీ ట్రెండ్ ఉన్న టైం కాబట్టి తక్కువ సమయం లోనే ఈ ఫీట్ సాధించేసాడు. ఇక ఇప్పుడు మాత్రం ఇదివరకున్న స్పీడ్ ఉండదు.

Allari Naresh 100th Film In Bhimavaram

ఒక వైపునుంచి కొత్త కామెడీ హీరోలతో పోటీ, రెండో వైపునుంచి మరీ కామెడీ బేస్ ఉన్న సినిమాలకి ఇదివరకున్నంత ఆదరన లేకపోవటం... ఒకే హీరోని ఒకే తరహా పాత్రల్లో ఎంతకాలం చూడగలరు? అయితే నరేష్ లో అద్బుతమైన నటుడున్నాడు...

గమ్యం, నేను, విశాఖ ఎక్స్ప్రెస్, ప్రాణం లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనం.. కానీ అలాంటి పాత్రలు వరుసగా రావు. సో ఈ లెక్ఖన నరేష్ వందో సినిమాకి చేరాలంటే ఇంకో పదిహేనేళ్ళ పైనే పడుతుంది. మరి అప్పౌడెప్పుడో రాబోయే సినిమాకి ఇప్పుడే మాటిచ్చిన నరేష్ ని చూసి... నిజం చెప్తున్నాడా...కామెడీ చేస్తున్నాడా అనికోవటం వినిపించింది భీమవరం లో

English summary
Recently Naresh was felicitated by Mavoollamma festival committee in Bhimavaram on the 52nd occasion of annual Mavoollamma festival. Speaking on this special occasion, Naresh said “I would plan my 100 th movie here in Bhimavaram”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu