సింగిల్ షాట్ కోసం 78 రీ టేక్ లు...అల్లరి నరేష్
హైదరాబాద్ : ఒకే సీన్ ని 78సార్లు చేస్తే ఎలా ఉంటుంది? ఆ అనుభవమే నరేష్‌కి ఎదురైంది. ఆయన హీరోగా నటించిన త్రీడీ చిత్రం 'యాక్షన్'. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫైట్ సీన్ చిత్రీకరణ రాత్రి ఎనిమిదింటికి ప్రారంభించారు.
అల్లరి నరేష్ పంచ్ విసరాలి. అలా విసిరినప్పుడు చేయి సరిగ్గా కెమెరాకి మూడు సెంటీమీటర్ల ముందుకు వచ్చి ఆగాలి. అంత కచ్చితమైన లెక్క ఎందుకంటే అది త్రీడీకి సంబంధించిన కెమెరా కాబట్టి. ఆ పంచ్ విసిరే సన్నివేశం ఓకే అయ్యేసరికి తెల్లారి ఆరు గంటలైంది. మొత్తం 78 టేక్‌లు తీసుకున్నారు.
ఈ విషయమై నరేష్ మాట్లాడుతూ ''సాధారణ చిత్రాలకీ, త్రీడీలకీ చిత్రీకరణపరంగా ఎంతో తేడా ఉంది. త్రీడీకి సంబంధించిన కెమెరాలను వినియోగించిన సందర్భంగా అన్నీ కచ్చితంగా చేయాల్సిందే. అందుకే ఎక్కువ టేక్‌లు తీసుకోవల్సి వచ్చేది. కొత్తగా అనిపించిందీ అనుభవం'' అన్నారు.
ఈ మధ్య వచ్చిన పలు సినిమాల్లో డాన్సుల విషయంలోనూ తనదైన మార్కు చూపించిన నరేష్...తాజాగా శృంగార రసాన్ని కూడా ప్రేక్షకులపై ఒలికించ బోతున్నాడు. యాక్షన్ 3డి' చిత్రంలో చిత్రీకరించిన ఓ సాంగు......దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాలను గుర్తు తెచ్చాయి. హీరోయిన్ బొడ్డుకు రకరకాల పండ్లు, పూలతో టచ్చింగులు, పాలతో హీరోయిన్ అందాలను తడిపేయడం లాంటి సీన్లతో ఈ సాంగు శృంగార రసాన్ని ఆస్వాదించే ప్రేక్షకులకు మరింత కిక్ ఇవ్వనుంది.
రీతూబర్మేచా, కామ్నజఠల్మానీ, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నాజర్, జయప్రకాష్‌రెడ్డి, మాస్టర్ భరత్, లివింగ్ స్టోన్, మనోబాల, మెయిలీ స్వామి, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి. 3డి స్టిరియోగ్రాఫర్: ఖైత్‌డ్రైవర్, సంగీతం: బప్పా-బప్పీలహరి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సహనిర్మాతలు: డా. బి.లక్ష్మారెడ్డి, అజయ్ సుంకర, మాటలు: శేఖర్-ఉపేంద్ర పాదాల, పాటలు: భువనచంద్ర, రామజోగయ్యశాస్ర్తీ, సిరాశ్రీ, కేదార్‌నాథ్, సహనిర్మాత: కిషోర్ గరికిపాటి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్ సుంకర.


Click it and Unblock the Notifications











