»   » పది నిముషాలు మిస్సయితే కథ అర్ధం కాదు

పది నిముషాలు మిస్సయితే కథ అర్ధం కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మా చిత్రాన్ని ప్రతి ప్రేక్షకుడు పది నిముషాలు కూడా మిస్‌ కాకుండా చూడాలి. ఒకవేళ మిస్‌ అయితే మళ్లీ కథలోకి రావడానికి టైమ్‌ పడుతుంది అంటున్నారు మన్యం రమేష్. 'అల్లరి' నరేష్‌, శివాజి, రాజీవ్‌ కనకాల, మీరా జాస్మిన్‌, గౌరి పండిట్‌ కాంబినేషన్‌లో ఆయన రూపొందిన ఆకాశరామన్న' చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్రం విశేషాలను మీడియా సమావేశంలో మన్యం రమేష్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. "మా చిత్రంలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంటుంది. 'గమ్యం' తర్వాత నరేష్‌ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేశారు. శివాజి, రాజీవ్‌ కనకాల పాత్రలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటూ 'ఆకాశరామన్న' అందర్నీ ఆహ్లాదపరుస్తుంది అన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. మార్చి మొదటి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' తెలిపారు. ఉషోదయం, ప్లాష్ న్యూస్ చిత్రాలు డైరక్ట్ చేసిన అశోక్‌ దర్శకత్వంలో మన్యం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మన్యం రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu