For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇదేంటిదీ..!? నమ్మలేకున్నా నిజం... అమితాబ్ వల్లే అల్లరి నరేష్..

  |

  సన్నగా ఉండే రూపం, కట్టె పుల్లల్లాంటి కాళ్ళూ..., పెద్ద కలరూ కాదు మరీ అందగాడేం కాదు... తిప్పటానికి మీసం కూదా సరిగా రాలేదు... ఏ దర్శకుడు... ఏనిర్మాత అతన్ని హీరో గా తీసుకుంటారు? పోనీ తీసుకున్నారే అనుకోండిప్రేక్షకులు... వాళ్ళ సంగతేంటి కనీసం అలాంటి హీరో వంక కన్నెత్తి చూస్తారా? ఒకప్పూదైతే చూదరూ అని చెప్పేవారేమో గానీ.... ఇప్పుడా చాన్స్ లేదు...

  చూసారు..., చూస్తున్నారు,,, చూస్తూ ఉంటారు... అల్లరి నరేష్ అన్న పేరు కనపడగానే అన్ని బదలనీ మరిపించే "జిందా తిలిస్మాత్" సీసాని చూసినట్టు పరుగెత్తుకు వెళ్ళిమరీ హాయిగా నవ్వుకుంటూ చూసినరోజులెన్ని లేవు?? "నేనూ", "శంబో శివ శంబో" ప్రాణం, గమ్యం, ఇలా ఏడిపించిన సినిమాలెన్నిలేవు...

  చిన్నప్పటినుంచే హీరో కావాలని ఉన్నా... నరేష్ రూపం చూసి ఈవీవీ అంత రిస్క్ తీసుకో దలుచుకోలేదు. ఆర్యన్ రాజేష్ ని హీరోని చేద్దామనుకున్నాడట. నరేష్ ని మాత్రం వేరే ఏదైనా డిపార్ట్ మెంట్ లోకి తోసేద్దాం అనుకున్నాడు. కానీ కొన్ని సార్లు ఎంత డైరెక్టరైనా అతని ఆటలు సాగవు.... హీరో లు తమంతట తామే వచ్చేస్తారు కాస్త ధైయం కావాలంతే... మనోడికి ఆ ధైర్యమే.. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నుంచి వచ్చిందట అదెలా అంటే నరేష్ మాటల్లోనే....

  Allari naresh about Amitab bacchan

  హీరోనా, దర్శకుడినా అనే క్లారిటీ ఉండేది కాదు కానీ, ఏం చేసినా ఈ ఇండ్రస్ట్రీలోనే అనేది మాత్రం క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే కనిపించేది. నాన్నగారు యేడాదికి రెండు మూడు సినిమాలు చేస్తుండేవారు. ఇంట్లో కనీసం ఓ డజనుమంది అసిస్టెంట్ డైరెక్టర్లుండేవాళ్ళు. నా చిన్న తనమంతా అలానే గడిచింది.

  నన్ను ప్రొడ్యూసర్‌ని చేయాలన్నది నాన్న ఆలోచన. దానికి ట్రైనింగ్ గానే "చాలా బాగుంది" సినిమాకి క్యాషియర్‌గా పనిచేశా. అయితే నాకు మాత్రం హీరో అయితే బాగుంటుంది అనిపించేది. కానీ 'నేను హీరో అయితే నన్ను చూస్తారా? బాగుంటానా' అనే భయాలు వెంటాడేవి. అందుకే నాన్న ముందు చెప్పలేకపోయేవాడ్ని. 'చాలాబాగుంది' వందరోజుల వేడుకకు అమితాబ్‌బచ్చన్‌ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు. నన్ను నాన్న పరిచయం చేస్తే "హైటెంతా అని అడిగారు" 6.2 అనంగానే "వీడు హీరో ఔతాడు... ఏమిటీ..! వీన్ని హీరోని చేస్తున్నాట్టే కదా అని నాన్న గారిని అడిగారు..

  మరీ ఆయన అలా అనేటప్పటికి నాన్న కూడా మొహమాటం కొద్దీ తలూపారు. కానీ ఆ తర్వాత అదేం పట్టించుకోనట్టే ఉండిపోయారు. ఆ తరవాత.. 'డాడీ నాకు హీరో అవ్వాలని ఉంది' అని నేనే ఆయన ముందు బయటపడిపోయా. అమితాబ్‌ కూడా ఇదే మాట చెప్పారని నాన్న కూడా "సరే.." అనేశారు. అలా అమితాబ్‌బచ్చన్‌ రికమెండేషన్‌తో నేను హీరో అయ్యానన్నమాట. అంటూ చెప్పుకొచ్చాడీ సెల్ఫీరాజా.....

  English summary
  "Amitab bacchan recomanded me as Hero" sais Allari Naresh
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X