»   » అల్లరి నరేష్: టీవీ సినిమాకి అంత ఖర్చు, శ్రమ ఎందుకు?

అల్లరి నరేష్: టీవీ సినిమాకి అంత ఖర్చు, శ్రమ ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇది టీవి సినిమా. నేను గతంలో నటించిన నేను సినిమా కూడా టెలివిజన్‌లో ప్రేక్షకులు విపరీతంగా చూశారు. లడ్డుబాబును కూడా థియేటర్లో చూడకపోయినా టీవిలో మాత్రం తప్పక చూస్తారు అంటూ చెప్పుకొచ్చారు అల్లరి నరేష్. అల్లరి నరేష్ హీరోగా రవిబాబు నుంచి వచ్చిన చిత్రం 'లడ్డుబాబు'. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. టీవీల్లో ఈ చిత్రం ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న అల్లరి నరేష్ ని...టీవీ లో ఆడటం కోసం ఇంత కష్టపడి, అంత ఖర్చు పెట్టి తీయాలా అంటున్నారు.

అలాగే లడ్డుబాబు గురించి చెపుతూ.... ప్రేక్షకులు ఊహించినంత కామెడీ సినిమాలో లేకపోవడంతో నిరుత్సాహపడ్డారు. దాంతో సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నా జీవితంలో ఓ భారీ ప్రయోగంగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఈ సినిమా కోసం ఏడు నెలలు కష్టపడ్డాను. ప్రతి రోజు 28 కేజీల మేకప్ మోస్తూ చాలా కష్టపడ్డాను.

సమయానికి భోజనం చేయక చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానంటే ఎక్కడైనా దురదొచ్చినా గోక్కోవడానికి వీలు లేకుండా లడ్డుబాబు పాత్ర కోసం కష్టపడ్డాను. ఈ సినిమా ఆడలేదంటే జనాల తప్పు కాదు. ఆ తప్పు మాదే. ఫీల్‌గుడ్ సినిమా చేద్దామని రవిబాబు చెప్పాడు. అయితే ప్రేక్షకులు మాత్రం నా ప్రీవియస్ సినిమాల్లోని కామెడీని దష్టిలోపెట్టుకుని ఈ సినిమా కొచ్చారు. ఆ విషయంలో మా లెక్కలు తప్పాయి అన్నారు.

 Allari Naresh about his latest 'Laddu Babu' flop

అలాగే రవిబాబు సైతం గతంలో ఈ విషయమై మాట్లాడుతూ...తను ఎందుకు కామెడీ సినిమాగా దీన్ని తీయలేదో చెప్పారు... హీరోని భారీకాయుడిగా చూపించి వినోదాత్మకమైన చిత్రం తీస్తారనుకున్నాం.. కానీ ఇలా భావోద్వేగభరిత సినిమా ఎందుకు తీశారు అని కొందరు అడుగుతున్నారు. నేను నరేష్‌తో సినిమా చేయాలి అనుకోగానే నాకు రెండు ఆలోచనలు వచ్చాయి. ఒకటి నరేష్‌తో సాధారణమైన వినోదాత్మకమైన సినిమా చేయకూడదని. రెండు ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులు, పిల్లలకు చేరాలని. అందుకే ఇలాంటి సినిమా చేశా అన్నారు. నా గత సినిమాలు చూసి ఈ సినిమాని అంచనా వెయ్యొద్దు. తాజా ఆలోచనలతో రండి.. సినిమా చూసి ఆనందించండి అని చెప్పారు.

ఇక 'అల్లరి'తో ప్రేక్షకులకు పరిచయమైన నరేష్‌ని 'లడ్డుబాబు'గా మార్చాను. ప్రచార చిత్రాలు చూసి కొందరు నరేష్‌ ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నారు. ఇప్పుడు మాత్రం ఎందుకు అలా చేశామో అర్థం చేసుకుంటున్నారు. ఇది ఓ బరువైన కథ. తండ్రీ- కొడుకు, తల్లి-బిడ్డ, స్నేహబంధం... ఇలా అనేక అంశాల్ని సినిమాలో చూపించాం. దానికి వినోదం కూడా జోడించాం. దీన్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. 'లడ్డుబాబు' కథను నరేష్‌ కోసం రాసుకోలేదు. 'లావు మనిషి' అంటూ చాలా కాలం క్రితమే రాసుకున్నాను. దీనికి నరేష్‌ అయితే బాగుంటాడు అని ఆయన్ని పెట్టుకున్నాం అన్నారు.

English summary

 
 
 Allari Naresh said that his ‘Laddu Babu’ it TV Movie. The film released last month with negitive talk. Actress Poorna is playing lead role in the movie and actress Bhumika is playing special role in the film. Produced by Tripuraneni Rajendra under the banner Maharadhi films. 
Please Wait while comments are loading...