»   » మహేశ్‌బాబు సినిమాలో అల్లరి నరేశ్.. హీరోయిన్‌గా బికిని సుందరి..

మహేశ్‌బాబు సినిమాలో అల్లరి నరేశ్.. హీరోయిన్‌గా బికిని సుందరి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కామెడీ హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకొన్న హీరో అల్లరి నరేశ్‌కు సక్సెస్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన నటించిన చిత్రాలు ఓ మోస్తారుగా ఆడుతున్నాయి. ఈ మధ్యకాలంలో సరైన హిట్ ఆయన ఖాతాలో పడలేదు. ప్రస్తుతం ఆయన ప్రిన్స్ మహేశ్‌బాబు నటించే సినిమాలో నటించనున్నట్టు ఫిలింనగర్‌లో వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆ వార్తలను నరేశ్ కూడా ధ్రువీకరించడం గమనార్హం.

ప్రిన్స్ మహేశ్ 25వ సినిమా

ప్రిన్స్ మహేశ్ 25వ సినిమా

దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా ప్రిన్స్ మహేశ్ ఓ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్గే ఎంపికైనట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం అల్లరి నరేశ్‌ను సంప్రదించారనే వార్త సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

ప్రిన్స్‌తో అల్లరి నరేశ్

ప్రిన్స్‌తో అల్లరి నరేశ్

ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్ సినిమా విషయంపై అల్లరి నరేశ్ క్లారిటీ ఇచ్చారు. మహేశ్‌బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా రూపొందుతున్న చిత్రం కోసం తనను సంప్రదించారనే విషయాన్ని ధ్రువీకరించారు. అయితే ఇంకా చర్చల దశలోనే ఈ వ్యవహారం ఉంది అని నరేశ్ పేర్కొన్నారు. అన్ని విషయాలు కొలిక్కి వచ్చిన తర్వాత నిర్మాతలే అధికారికంగా ప్రకటిస్తారని ఆయన చెప్పారు.

 వంశీ పైడిపల్లికి మహేశ్ గ్రీన్ సిగ్నల్

వంశీ పైడిపల్లికి మహేశ్ గ్రీన్ సిగ్నల్

ఊపిరి లాంటి విభిన్నమైన చిత్రాన్ని రూపొందించిన వంశీ పైడిపల్లి చెప్పిన కథకు మహేశ్‌బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

త్వరలోనే అధికారికంగా..

త్వరలోనే అధికారికంగా..

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌పై కసరత్తు చేస్తున్నారు. ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేసే సినిమాను అందించాలన్న లక్ష్యంతో ఈ సినిమా కథపై దృష్టిపెట్టారు. నటీనటుల ఎంపిక, ఇతర అంశాలపై వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించనున్నారు.

English summary
Ashwini Dutt and DIL Raju are the producers of the film. The latest rumours reveal us that the makers are considering Pooja Hegde as the female lead for the film. Meanwhile, we already knew that the film unit is holding discussions with Allari Naresh for an important role in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu