Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అల్లరి నరేష్ 3D మూవీ ఫస్ట్ లుక్
కామెడీ చిత్రాల హీరోగా పేరు సంపాదించుకున్న అల్లరి నరేష్ త్వరలో ఓ 3డి చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతెన్న సంగతి తెలిసిందే. 'యాక్షన్' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీకి 'విత్ ఎంటర్ టైన్మెంట్'అనేది సబ్ కాప్షన్. ఈ చిత్రానికి అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ చిత్రాన్ని ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం నిర్మిస్తున్నారు.
ఈ నెల 15 నుండి ఈ చిత్ర రెండవ షెడ్యూల్ చిత్రీకరణ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ తో మొదటి అర్ధ భాగం చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది. కిక్ శ్యాం,వైభవ్,రాజ సుందరం,స్నేహ ఉల్లాల్ మరియు కామ్న జేత్మలనిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బప్పి లహరి తనయుడు బప్పా లహరి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు తమన్ నేఫధ్య సంగీతం అందిస్తున్నారు.
ఈ రోజు అల్లరి నరేష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ రోజుతో అల్లరినరేష్ సినీ పరిశ్రమకు పరిచయం అయి 10 సంవత్సరాలయింది. చెన్నైలోస్కూల్ లైఫ్ పూర్తి చేసుకుని ఆ తరువాత 2002లో అల్లరి సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ గారి అబ్బాయిగా ఇండస్ట్రీకి పరిచయమయినప్పటికీ తన సొంత టాలెంట్ నమ్ముకుని ప్రేక్షకులను నవ్విస్తూ కామెడీ కింగ్ గా ఎదిగాడు. కామెడీ సినిమాల్లో నటిస్తూనే నేను, శంభో శివ శంభో, గమ్యం వంటి చిత్రాలతో తనలోని సీరియస్ నటుడిని చూపించాడు. ప్రస్తుతం నరేష్ సుడిగాడు, యాక్షన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. నరేష్ మనల్ని ఎప్పుడూ తన సినిమాలతో ఎంటర్‌టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుదాం.