అల్లరి నరేష్,రవిబాబు చిత్రం టైటిల్ ఇదే
హైదరాబాద్ : అల్లరి నరేష్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'లడ్డూబాబు' అనే పేరుని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇందులో భూమిక ఓ కీలక పాత్రలో నటిస్తుందని తెలిసింది. చక్రి స్వరాలు అందిస్తున్నారు. త్రిపురనేని రాజేంద్ర నిర్మాత.
అల్లరి నరేష్ -రవిబాబు కాంబినేషన్‌లో 'అల్లరి' ఎంతటి సంచలనమో తెలిసిందే. కామెడీ నేరేషన్‌లో సరికొత్త పంథాని తెలుగు తెరకి పరిచయం చేశారు దర్శకుడు రవిబాబు. అయితే ఆ సినిమా తర్వాత నరేష్, రవిబాబు ఎవరిదారిలో వారు కెరీర్ పయనం సాగించారు. ఇన్నాళ్టికి వీరిద్దరి కలయికలో మరో సినిమాకి రంగం సిద్ధమైంది. ఈ సారి నరేష్‌ని డబుల్ రోల్‌లో చూపించడానికి రవిబాబు కసరత్తులు చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుతం అల్లరి నరేష్ 'కెవ్వు కేక' చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రానికి దేవిప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. షర్మిల మాంద్రే కథానాయిక. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications












