»   » కేన్సర్ బాధిత బాలిక కోసం అల్లరి నరేష్ (ఫోటోస్)

కేన్సర్ బాధిత బాలిక కోసం అల్లరి నరేష్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు యువ నటుడు అల్లరి నరేష్ కేన్సర బాధిత బాలిక కోసం ఎం.ఎన్.జె క్యాన్సర్ ఆసుపత్రి వచ్చారు. కేన్సర్ తో బాధ పడుతున్న బాలిక పుట్టినరోజును సెలబ్రేట్ చేసారు. కేన్సర్ ఆసుత్రిలో ఇక్కడి పిల్లలతో గడపడం ఆనందంగా ఉంది. జీవితంలో ఇది మరుపురాని సమయం. వీరికి దేవుడు చక్కని ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

అల్లరి నరేష్ సినిమాల విషయానికొస్తే...
అల్లరి నరేష్, ఇషా జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్న చిత్రం 'బందిపోటు'. దొంగల్ని దోచుకో అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి 6 న విడుదల అవుతుందని భావించారు. అయితే అందిన సమాచారం ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ లేటు అవటం వలన మరో రెండు వారాలకు వాయిదా పడనుందని తెలుస్తోంది. సంపూర్ణేష్ బాబు, సప్తగిరి వంటి స్టార్ కమిడయన్స్ ఉండటంతో సినిమా కామెడీ కొత్త పుంతలు తొక్కుతుందని భావిస్తున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


క్యాన్సర్ ఆసుత్రిలో

క్యాన్సర్ ఆసుత్రిలో

కేన్సర్ ఆసుపత్రిలో పిల్లలకు పళ్ల రసాలు పంచుతున్న దృశ్యం.


అక్కడి పిల్లలతో కలిసి

అక్కడి పిల్లలతో కలిసి

కేన్సర్ వ్యాధితో బాధ పడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలలతో కలిసి అల్లరి నరేష్.


పుట్టినరోజు

పుట్టినరోజు

కేన్సర్ తో బాధ పడుతున్న ఓ బాలిక పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న అల్లరి నరేష్.


ఆరోగ్యం ప్రసాదించాలని

ఆరోగ్యం ప్రసాదించాలని

కేన్సర్ ఆసుత్రిలో ఇక్కడి పిల్లలతో గడపడం ఆనందంగా ఉంది. జీవితంలో ఇది మరుపురాని సమయం. వీరికి దేవుడు చక్కని ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అల్లరి నరేష్ చెప్పుకొచ్చారు


English summary
"Spent some time with these little kids at MNJ cancer Hospital Yesterday. Celebrated a baby's birthday too. Those moments were memorable. May god bless them with good health and joy." Allari Naresh said.
Please Wait while comments are loading...