»   » మహేష్ బాబు సినిమాలో అల్లరి నరేష్..!? మరో గాలిసీను వస్తున్నట్టేనా?

మహేష్ బాబు సినిమాలో అల్లరి నరేష్..!? మరో గాలిసీను వస్తున్నట్టేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం మహేశ్ బాబు .. మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంబంధించి మీడియా, అభిమానుల సర్కిల్ లో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ సాగుతూ ఉంటుంది. ఈ సినిమాకు ఇంకా అఫీషియల్ టైటిల్ ఖరారు కానప్పటికీ రకరకాల టైటిల్ ఇప్పటి వరకు ప్రచారంలోకి వచ్చాయి.

 కొరటాల శివతో

కొరటాల శివతో

ఈ మూవీకి వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. తాజాగా 'ఏజెంట్ శివ' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. 'ఏజెంట్ శివ' ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే... ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే మహేష్ కొరటాల శివతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. అందుకు సంబధించిన పనుల్లోనే వంశీ పైడిపల్లి వున్నాడు.

అల్లరి నరేష్

అల్లరి నరేష్

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర వుందట. ఆ పాత్రను అల్లరి నరేష్ తో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో, ఆయనని కలిసి కథ .. పాత్ర తీరుతెన్నుల గురించి వంశీ పైడిపల్లి చెప్పాడట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తుండగా, ఈ మూవీ ఓ రొమాంటిక్ థ్రిల్లర్ గా ఉంటుందని అంటున్నారు.

మేడ మీద అబ్బాయి

మేడ మీద అబ్బాయి

యూఎస్ లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ త్వరలోనే వెల్లడించనున్నారు. అల్లరి నరేష్ ప్రస్తుతం మలయాళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ప్రజిత్ కరనవర్ దర్శకత్వంలో మేడ మీద అబ్బాయి అనే టైటిల్ తో ఈ మూవీ రూపొందుతుంది.

 జూన్ 23న విడుదల

జూన్ 23న విడుదల

ఈ ఏడాదిలోనే ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. ఇక మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జూన్ 23న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే నరేష్ ఏమన్నాడనే విషయం తెలియాల్సి వుంది. ఆయన ఆ పాత్రను చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

English summary
Comedy hero Allari Naresh, who rnhas been struggling for a while to score a decent hit, has reportedly rnbeen offered a key role in MaheshVamsi Paidipally project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu