»   » అల్లరి నరేష్ 'బెట్టింగ్ బంగార్రాజు' స్టోరీ పాయింట్...

అల్లరి నరేష్ 'బెట్టింగ్ బంగార్రాజు' స్టోరీ పాయింట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిజాయతీ వున్న యువకుడు బంగార్రాజు. ప్రతి విషయంపైనా బెట్టు కాస్తాడు, గెలుస్తాడు. అతను కాసే ప్రతి బెట్టులోనూ బోలెడంత వినోదం కనిపిస్తుంది. అయితే ఓ సారి బంగార్రాజు పందెంలో ఓడిపోతాడు...కానీ గెలుస్తాడు.అదెలా జరుగుతుందనేది, గెలుచుకున్న పందెం ఏమిటన్నదే ఈ చిత్రకథ. ఇక ఈ చిత్రాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేశారు. అల్లరి' నరేష్, నిధి జంటగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మిస్తున్నారు.

విడుదల కోసం తుదిమెరుగులు దిద్దుకుంటున్న 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రం విశేషాలు తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇ.సత్తిబాబు మాట్లాడుతూ..."సినిమా పేరు చూడగానే హీరో బెట్టింగులు కాస్తుంటాడని తెలుస్తుంది. పల్లెటూరిలో మొదలైన కథ పట్నం వెళ్లి మళ్లీ పల్లెకి చేరుతుంది. బంగార్రాజు చేసే ప్రతి పనిలో నిజాయతీ ఉంటుంది. అతనికి సుడి కలిసొస్తుంది. గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ చేశాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తికావచ్చాయి. మార్చి రెండో వారంలో పాటలను విడుదల చేస్తున్నాం. వేసవికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు.

హీరో నరేష్ మాట్లాడుతూ, 'ఉషాకిరణ్ మూవీస్ వంటి పెద్ద సంస్థలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో బంగార్రాజుకు చదువు లేకపోయినా సుడి ఉంది. అతను చేసే చేష్టలు నవ్విస్తాయి. 'గమ్యం' సినిమా తర్వాత గంధం నాగరాజు రాసిన మాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. 'బ' అక్షరం నాకు సెంటిమెంట్ అంటున్నారు.ఆ అక్షరంతో మొదలయ్యే ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు.

కీలకపాత్ర చేస్తున్న చలపతిరావు మాట్లాడుతూ..'ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో నరేష్ యుగం నడుస్తోంది. ఏడాదికి 5,6 చిత్రాలు చేస్తూ పరోక్షంగా ఎంతో మందికి సాయపడుతున్నారు. అతను తొలిసారిగా ఉషాకిరణ్ మూవీస్ సంస్థలో చేస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆశిస్తున్నాను' అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu