»   » బిగ్ బాస్‌లో అల్లరి నరేష్.. భోరున ఏడ్చిన హరితేజ.. దీక్షాను ఆడుకున్న నవదీప్

బిగ్ బాస్‌లో అల్లరి నరేష్.. భోరున ఏడ్చిన హరితేజ.. దీక్షాను ఆడుకున్న నవదీప్

Written By:
Subscribe to Filmibeat Telugu

బిగ్ బాస్ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూ ముగింపు దశకు చేరుకున్నది. 50 రోజులకు పైగా అనేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. బుధవారం నాటి కార్యక్రమంలో పాఠశాల ఎపిసోడ్... అనాథ పిల్లలతో ఆటపాట కార్యక్రమం ఆకట్టుకున్నది.

దీక్ష, హరితేజ ఉపాధ్యాయులుగా ..

దీక్ష, హరితేజ ఉపాధ్యాయులుగా ..

బిగ్ బాస్ కార్యక్రమంలో రోజు వారి పనుల్లో భాగంగా పాఠశాల ఎపిసోడ్ ను నిర్వహించారు. దీక్ష, హరితేజ ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. పాఠశాలలో పిల్లలుగా శివ బాలజీ, నవదీప్, ప్రిన్స్, ఆదర్శ్, అర్చన నటించారు.

నవ్వుల పాలైన దీక్షా

నవ్వుల పాలైన దీక్షా

షోలో భాగంగా దీక్షా పంత్ లెక్కల టీచర్ గా వ్యవహరించింది. అయితే టీచర్ గా తన ప్రభావం చూపక పోగా, పిల్లల చేతలో నవ్వుల పాలైంది. నవదీప్ వేసిన సులభమైన ఫార్ములాను సాల్వ్ చేయకపోగా తికమకకు గురైంది.

బిగ్ బాస్ హౌస్ లోకి అనాధ పిల్లలు..

బిగ్ బాస్ హౌస్ లోకి అనాధ పిల్లలు..

బుధవారం బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలు కాకుండా అనాధ పిల్లలు వచ్చారు. ఇంటిలోని సెలబ్రిటీలు పిల్లలతో ఆడుకున్నారు. పిల్లలకు అర్చన మేకప్ వేసి అందంగా అలంకరించింది.

అమ్మను గుర్తు చేసుకొని

అమ్మను గుర్తు చేసుకొని

పాఠశాల ఎపిసోడ్ లో సూపర్ మామ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో అమ్మ గురించి రాసి... తమ భావన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హరితేజ అమ్మను గుర్తు చేసుకొని భోరున ఏడ్చింది. ఒక్కసారి అమ్మను గురించిన సమాచారాన్ని అందించాలని బిగ్ బాస్ ను కొరింది.

బిగ్ బాస్‌లో అల్లరి నరేష్

బిగ్ బాస్‌లో అల్లరి నరేష్

గురువారం నాటి ఏపిసోడ్ లో భాగంగా ఇంటిలోకి సినీనటుడు అల్లరి నరేష్ ప్రవేశించనున్నాడు. శుక్రవారం రిలీజ్ కానున్న మేడ మీద అబ్బాయి చిత్రం ప్రమోషన్ బిగ్ బాస్ హౌస్ లో చేపట్టనున్నారు. ఈ వేదికను అల్లరి నరేష్ తన సినిమా కోసం ఉపయోగించుకోవడం గమనార్హం.

మూవీ ప్రమోషన్ కోసం

మూవీ ప్రమోషన్ కోసం

ఇప్పటికే కొందరు హీరోలు తమ మూవీ ప్రమోషన్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోను ఎంచుకుంటున్నారు. ఇటీవల రానా, విజయ్ దేవరకొండ, తాప్సి తదితరులు కూడా ఈ
షోలో పాల్గొని సందడి చేశారు. ఇవాళ తన సినిమా మేడ మీద అబ్బాయి ప్రమోషన్ కోసం బిగ్‌బాస్ షోలో అల్లరి నరేష్ సందడి చేయనున్నారు.

హీరోలకు సెంటిమెంట్‌గా..

హీరోలకు సెంటిమెంట్‌గా..

ఇక్కడ ప్రచారం చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో హీరోలకు ఇదో సెంటిమెంట్‌గా మారింది. అదే సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈరోజు ప్రసారంకానున్న షోలో నరేష్
రెడీ అయ్యారు. ప్రణీత్ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమాలో నరేష్ సరసన కొత్త హీరోయిన్ నిఖిల విమల సందడి చేయనున్నారు.

English summary
All house mates in Big Boss Show played Teacher and Students game. Hariteja cried and expressed a deep concern to know about her parents to Bigboss. Diksha acted as teacher and got teased by all house mates for her mathematics skills. Allari Naresh is coming to Big Boss Show for the promotion of Meda meeda abbayi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu