అల్లరి నరేష్ చిన్నప్పుడు ఇలా...(ఫోటో)
అల్లరి నరేష్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన 'యాక్షన్ 3డి' చిత్రం ఈ నెల 21న విడుదలకు సిద్దం అవుతోంది. ఈ చిత్రం 2డి తో పాటు 3డిలోనూ విడుదల చేస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. భారతీయ సినీ రంగ చరిత్రలో 3డిలో రూపొందిన తొలి కామెడీ చిత్రం ఇదేకావడం విశేషం. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈచిత్రాన్ని నిర్మించారు.
దీంతో పాటు నరేష్ 'కెవ్వుకేక' అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు. బ్లేడ్ బాబ్జీ వంటి విజయంతమైన చిత్రం తర్వాత అల్లరి నరేష్-దేవిప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'కెవ్వు కేక'. షర్మిల మాంద్రే కథానాయిక. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత రవిబాబు దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు అల్లరి నరేష్. రవి బాబు దర్శకత్వంలో వచ్చిన 'అల్లరి' చిత్రం ద్వారానే నరేష్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇప్పడు వీరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది.


Click it and Unblock the Notifications












