»   » మమ్ములని రిచ్ గా ఉంచుతాడనే ‘అల్లరో’డికి అడిగినంత...!?

మమ్ములని రిచ్ గా ఉంచుతాడనే ‘అల్లరో’డికి అడిగినంత...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి చిత్రంతో అదే తన ఇంటి పేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ తన నటనతో పరిశ్రమను వశం చేసుకున్నాడు. అతను నటించిని బ్లేడ్ బాబ్జీ, బెండు అప్పారావు వంటి చిత్రాలు మంచి సక్సెస్ ను ఇచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే యేడాదిలో కనీసం 8 సినిమాలు చేస్తే అందులో కనీసం 5, 6 సినిమాలు విజయవంతం అవుతున్నాయంటే ఆ క్రెడిట్ మొత్తం అల్లరిదే..గతంలో ఈ రికార్డు యన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లకు మాత్రమే ఉండేడి..

వీరంతా నెంబర్ స్థానాలను అధిష్టించారు, ఇప్పుడు చెప్పుకుంటున్న టాప్ 4హీరోస్ ని ప్రక్కన పెట్టి అల్లరి నరేష్ కి ఆ స్థానం ఇచ్చినా అది సమంజసమే అనిపిస్తుంది. ఎందుకంటే మినిమమ్ గ్యారంటీ హీరో అనే గుర్తింపుతో పాటు..ఇతర బ్యానర్లోలోనే అతను చిత్రాలు చేస్తున్నాడు కాబట్టి. అలాగే తండ్రి గొప్ప దర్శకుడే అయినా ఎక్కడా తన పేరు వాడకుండా..ఎటువంటి డబ్బాలు కొట్టకుండా, సొంత టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడున్న నలుగు టాప్ హీరోలు సొంత బ్యానర్లు..సొంతం అనుకునే వారి బ్యానర్ల లో చేసిన చిత్రాలే ఎక్కువ కాబట్టి అల్లరికి నెంవర్ వన్ స్థానం ఇస్తే ఎలా ఉంటుంది..?

ఎన్ని అనుకున్నా అది అతనికి దక్కదు..కానీ ఆ విషయం ప్రక్కన పెట్టి టైటిల్ విషయానికి వద్దాం..ఇప్పటి వరకు చిత్రానికి 60 నుండి 80 లక్షలు తీసుకునే ఈ అల్లరోడు ఇప్పుడు కోటి ఇరవై లక్షలు కావాలని అడుగుతున్నాడట. అందుకే కాస్ట్ లీ అనాల్సి వచ్చింది. ఈ అల్లరోడు అంత అడుతుతున్నాడట. అందుకే కాస్ట్ లీ అనాల్సి వచ్చింది..ఈ అల్లరోడు అంత అడుగుతున్నా..తమని రిచ్ గా ఉంచుతాడనే మినిమమ్ గ్యారంటీ ఉంది కాబట్టి అల్లరోడు అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఇష్టపడుతున్నారట. ప్రస్తుతం అల్లరి నరేష్, కళాతపస్వీ కె విశ్వనాథ్ డైరెక్షన్ లో 'సుమధురం" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దం కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu