Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సెప్టెంబర్ నుంచి అల్లరి నరేష్ కొత్త చిత్రం
అంబికా కృష్ణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తారు. నరేష్ సరసన విశాఖ సింగ్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయి. సెప్టెంబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. సుడిగాడు లో డ్యూయిల్ రోల్ లో కనిపించిన అల్లరి నరేష్ ...త్వరలో ఈ చిత్రంలో మరోసారి ద్విపాత్రాభినయం చేస్తూ నవ్వించబోతున్నారు.
తమిళంలో విజయవంతమైన 'కలగలప్పు' అనే సినిమా రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. రీసెంట్ గా నరేష్ - సత్తిబాబు కలయికలో 'యముడికి మొగుడు' వచ్చింది. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. తమిళంలో సూపర్ హిట్టైన 'కలగలప్పు' ఇద్దరికీ విజయం తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఇక 'కలగలప్పు' చిత్రం ఇద్దరు స్నేహితులు తమ వారసత్వంగా వచ్చిన రెస్టారెంట్ ని ఓ రియల్ ఎస్టేట్ డవలపర్ నుంచి కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నాలతో రూపొందింది. ఈ చిత్రం సోల్ కిచెన్ అనే జర్మినీ చిత్రం ఆధారంగా రూపొంది తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ ఈ చిత్రం వర్కవుట్ అయ్యే అవకాసం ఉంది.
ప్రస్తుతం రవిబాబు దర్శకత్వంలో 'లడ్డూ బాబు'గా ముస్తాబవుతున్నారు నరేష్. త్రిపురనేని రాజేంద్ర నిర్మాత. ఈ సినిమాలో నరేష్ కోసం ప్రత్యేకమైన మేకప్ విధానాలను అనుసరిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్ పాత్ర కొత్త తరహాలో వినోదాన్ని పంచేలా ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన మేకప్ కోసం లండన్‌లోని నిపుణులను సంప్రదించారు. వారి సూచనలకు అనుగుణంగా నరేష్‌కి మేకప్ చేస్తున్నారు. ఇందుకోసం సుమారు మూడు గంటలపాటు మేకప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చిత్రీకరణ విషయంలో హీరో, దర్శకనిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సెట్‌కి యూనిట్ మినహా మరెవరూ రాకుండా చూసుకొంటున్నారు.